దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ State Bank of India (SBI) షేర్ మార్కెట్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుని పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ అందించింది. బుధవారం ఎన్ఎస్ఈలో షేర్ ధర 3.8 శాతం పెరిగి రూ.1,187కు చేరి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ.38,000 కోట్లకు పైగా పెరిగి రూ.10.94 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలతో ఎస్‌బీఐ దేశంలో నాల్గవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించి టీసీఎస్‌ను అధిగమించింది.
Read Also: Bandh: రేపు భారత్ బంద్.. విద్యాసంస్థలకి సెలవు ఉందా?
అత్యంత విలువైన కంపెనీలు
ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 10.5 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ షేర్ ధర 2024, ఆగష్టు 30న నమోదైన రూ. 4,552 ఆల్టైమ్ రికార్డు గరిష్ఠం నుంచి 36 శాతం పడిపోయి, బుధవారం రూ. 2,909 వద్ద ఉంది. ఇక, ఎస్బీఐ కంటే ముందు, దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రూ. 19.87 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత హెచ్ఎఎఫ్సీ బ్యాంక్(రూ. 14.26 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్(రూ. 11.5 లక్షల కోట్లు) అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: