📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. పెరిగిన ఏటీఎం ఛార్జీలు

Author Icon By Vanipushpa
Updated: January 10, 2026 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)(SBI) తమ ఖాతాదారులకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ఛేంజ్ రుసుములు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు తెలిపింది. పెంచిన ఈ కొత్త ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మార్పుల ప్రభావం ప్రధానంగా సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై పడనుంది. సవరించిన నిబంధనల ప్రకారం.. ఎస్‌బీఐ ఖాతాదారులు ఉచిత పరిమితి దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే నగదు విత్‌డ్రాయల్‌పై ఇకపై రూ. 23తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ. 21 ( జీఎస్టీ అదనం)గా ఉండేది. అలాగే, బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలపై ఛార్జీని రూ. 10 నుంచి రూ. 11కి (జీఎస్టీ అదనం) పెంచారు. సేవింగ్స్ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీల పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

Read Also: Hoshiarpur Road Accident: బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. పెరిగిన ఏటీఎం ఛార్జీలు

శాలరీ ప్యాకేజీ ఖాతాదారుల విషయంలో ఎస్‌బీఐ కీలక మార్పులు

ముఖ్యంగా శాలరీ ప్యాకేజీ ఖాతాదారుల విషయంలో ఎస్‌బీఐ కీలక మార్పులు చేసింది. గతంలో వీరికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం ఉండగా, ఇప్పుడు దానిని నెలకు 10కి పరిమితం చేసింది. ఈ 10 లావాదేవీలు దాటిన తర్వాత చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ. 23, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ. 11 (జీఎస్టీ అదనం) చెల్లించాలి. అయితే, కొన్ని ఖాతాలపై ఈ పెంపు ప్రభావం ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాల సర్వీస్ ఛార్జీలలో ఎలాంటి మార్పులు లేవు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

ATM Transaction Fees Banking Fee Changes India Latest News in Telugu SBI ATM Charges Hike SBI Customers Update SBI Service Charges State Bank of India News Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.