📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Satyajit Barman : గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో ఘటన

Author Icon By Divya Vani M
Updated: April 11, 2025 • 8:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ఓ సామాజిక కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది ఆహారం నాణ్యతపై ప్రశ్నించిన ప్రయాణికులపై ఐఆర్‌సీటీసీ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది ఏప్రిల్ 6న ముంబయికి తిరిగి వస్తున్న సత్యజిత్ బర్మన్ అనే సామాజిక కార్యకర్త, గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బద్నేరా సమీపంలో కొందరు ప్రయాణికులు ఆహారం బరువు తక్కువగా, ధరలు అధికంగా ఉన్నాయని వాదనకు దిగారు.ఈ సమయంలో బర్మన్ ప్రయాణికుల బాధలను తెలుసుకునేందుకు ప్యాంట్రీ కార్‌కి వెళ్లాడు. అక్కడ సిబ్బంది తాను తూకం చూసుకోవచ్చని చెప్పడంతో మైదుల్ మల్లిక్, ఆషికుల్ హక్, నజ్రుల్ షేక్‌లను వెంట తీసుకుని ఆయన వెళ్లాడు.

Satyajit Barman గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో ఘటన

అయితే అక్కడ పరిస్థితి అనూహ్యంగా మారింది ప్యాంట్రీ కార్ మేనేజర్ బర్మన్‌పై ఆరోపణలు చేస్తూ దూషించాడు అతని ఫోన్ లాక్కుని కొట్టి, గంటకు పైగా బలవంతంగా కూర్చోబెట్టినట్టు సమాచారం. అంతే కాదు మిగతా సిబ్బంది ఇతర ప్రయాణికుల్ని బెదిరించి కంపార్ట్‌మెంట్‌లకు పంపారు ఒక ప్రయాణికుడు ఆర్‌పీఎఫ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు చేరుకుని బర్మన్‌ను విడిపించారు. అనంతరం ఆయన తన సీటుకు చేరాడు రైలు కళ్యాణ్‌కి చేరిన తర్వాత బర్మన్ స్థానిక జీఆర్‌పీకి ఫిర్యాదు చేశాడు. ఏడుగురు ఐఆర్‌సీటీసీ ఉద్యోగులపై కేసు నమోదు అయింది ఈ ఘటన బద్నేరా జీఆర్‌పీ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సామాజిక కార్యకర్త సమీర్ జవేరి, “ఐఆర్‌సీటీసీ కాంట్రాక్టర్లు ఎలా దోచుకుంటున్నారో ఇది నిదర్శనం” అన్నారు. ప్రయాణికుల హక్కులు రక్షించేందుకు రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి ప్రయాణికుల న్యాయం కోసం సమర్థవంతమైన చర్యలు అవసరం.

Gitanjali Express IRCTC food complaint IRCTC staff assault IRCTC staff misbehavior Pantry car incident Railway passenger rights Train food quality

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.