📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News : Satya Nadella: ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌కు ఏఐపై నైపుణ్య శిక్ష‌ణ ఇస్తాం: స‌త్యా నాదెళ్ల‌

Author Icon By Sudha
Updated: December 11, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మైక్రోసాఫ్ట్ చైర్మెన్‌, సీఈవో స‌త్యా నాదెళ్ల(Satya Nadella) ఇవాళ బెంగుళూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. భార‌త్‌లోని కృత్రిమ‌మేధ వ్య‌వ‌స్థ‌కు త‌గిన రీతిలో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క్లోడ్ కంప్యూటింగ్ వ్య‌వ‌స్థ‌ను కూడా మైక్రోసాఫ్ట్ మ‌రింత ప‌టిష్టం చేసేందుకు ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌కు కృత్రిమ మేధపై శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. భార‌త్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ఉత్సాహాన్ని ఇస్తోంద‌న్నారు. ఉత్త‌మైన మౌళిక స‌దుపాయాల్ని క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. సుమారు 17.5 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు స‌త్యానాదెళ్ల తెలిపారు. ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్‌కు చెందిన అత్యంత భారీ పెట్టుబ‌డి ఇదేఅని పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్ విస్తృతంగా వ్యాపిస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ చైర్మెన్ స‌త్యా నాదెళ్ల (Satya Nadella)తెలిపారు. అజూర్ కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ‌పై వ‌ర్క్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 70 క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో డేటా సెంట‌ర్లు ఉన్నాయ‌న్నారు. భార‌త్‌లోనూ మైక్రోసాఫ్ట్ సెంట‌ర్లు పెరుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గిట్‌హ‌బ్ లో 2030 నాటికి ఇండియా నెంబ‌ర్ వ‌న్‌గా మారుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు.

Read Also : http://Amit Shah Rahul Gandhi clash : అమిత్ షా–రాహుల్ గాంధీ వాగ్వాదం ‘వోటు దొంగతనం’ వివాదం మళ్లీ హాట్..

Satya Nadella

భార‌త్‌లో జియోతోనూ భాగ‌స్వామ్యం ఉంద‌న్నారు. 2026లో కొత్త డేటా సెంట‌ర్ ప్రాంతం ఆప‌రేష‌నల్‌గా మార‌నున్న‌ట్లు నాదెళ్ల చెప్పారు. ద‌క్షిణ‌మ‌ధ్య భార‌తంలో కొత్త డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌బోనున్న‌ట్లు నాదెళ్ల పేర్కొన్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌పై సుమారు రెండు కోట్ల మంది భార‌తీయుల‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు నాదెళ్ల తెలిపారు. ప్ర‌భుత్వానికి చెందిన ఈ-శ్ర‌మ్ ప్రోగ్రామ్ ద్వారా అసంఘ‌టిత కార్మికుల‌ను ఏఐతో చైత‌న్య‌ప‌ర‌చ‌వ‌చ్చు అన్నారు. భార‌త్‌లోని ప్ర‌తి వ్య‌క్తిని, ప్ర‌తి సంస్థ‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని నాదెళ్ల పేర్కొన్నారు.

Read hindi news : http://hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AI training Artificial intelligence Breaking News india latest news Microsoft satya nadella Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.