📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sasikala New Party: వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం

Author Icon By Anusha
Updated: February 26, 2026 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sasikala New Party: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తన రాజకీయ పునరాగమనాన్ని అధికారికంగా ధృవీకరించారు. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆమె, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె, పార్టీ ప్రారంభానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. “వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం. పొత్తుల కోసం కూడా చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు కచ్చితంగా ఒక మంచి నిర్ణయానికి దారితీస్తాయి” అని శశికళ పేర్కొన్నారు. అయితే, ఏ పార్టీలతో చర్చలు జరుపుతున్నారనే వివరాలను వెల్లడించడానికి ఆమె నిరాకరించారు.

Read Also: India has no violent: హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

Sasikala New Party: We will announce the name of the party within a week

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం: వేడెక్కిన రాజకీయాలు

ఈ వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీ నిర్మాణం సవాలుగా మారదా? అని విలేకరులు ప్రశ్నించగా శశికళ ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానం, ప్రజా జీవితం గురించి తమిళనాడు ప్రజలకు బాగా తెలుసని, కాబట్టి పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా నిన్న‌ కన్నుమూసిన సీపీఐ సీనియర్ నేత ఆర్. నల్లకన్నుకు శశికళ నివాళులర్పించారు. ఆయన పేదల సంక్షేమానికే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడని ఆమె కొనియాడారు. ఎంపీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ ఏ పదవి చేపట్టకపోయినా, తన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి వరకు నిలిచారని గుర్తు చేసుకున్నారు. “ఆయన అందరితో ఆప్యాయంగా ఉండేవారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు, ఆయన ఉద్యమానికి తీరని లోటు” అని శశికళ విచారం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AIADMK vs Sasikala Sasikala New Party Sasikala Political Entry Tamil Nadu Politics 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.