Tamil nadu politics : తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి J. Jayalalithaaకు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన V. K. Sasikala తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జయలలిత జయంతి సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో రూపొందించిన జెండా మధ్యలో C. N. Annadurai, M. G. Ramachandran, జయలలిత చిత్రాలను చేర్చడం ద్వారా తానే “అమ్మ” అసలైన రాజకీయ వారసురాలిననే సందేశాన్ని కేడర్‌కు ఇచ్చారు.
“అమ్మ” జ్ఞాపకాలతో భావోద్వేగం
సభలో ప్రసంగించిన శశికళ జయలలిత మరణం తర్వాత తనపై జరిగిన ఆరోపణలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనపై జరిగిన దుష్ప్రచారం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. అప్పట్లో వ్యక్తిగత విషాదంలో ఉండటంతో పదవులపై ఆసక్తి చూపలేదని, అయితే తన మౌనాన్ని బలహీనతగా భావించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Kerala High Court: కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్
అన్నాడీఎంకే నాయకత్వంపై విమర్శలు
ప్రస్తుత పార్టీ నాయకత్వంపై ఆమె తీవ్ర (Tamil nadu politics) విమర్శలు చేశారు. Edappadi K. Palaniswamiను ముఖ్యమంత్రిగా చేయడం తాను చేసిన పెద్ద తప్పిదమని వ్యాఖ్యానించారు. పదవి చేపట్టిన తర్వాత తనను పార్టీ నుంచి దూరం చేశారని మండిపడ్డారు. O. Panneerselvam వైఖరిని కూడా ఆమె విమర్శించారు.
కొత్త రాజకీయ దిశ
ఇకపై తమిళనాట తనదైన శైలిలో రాజకీయాలు చేస్తానని శశికళ ప్రకటించారు. పార్టీ పేరు, విధివిధానాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ పరిణామంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: