Sanjay Agarwal case : ఘనశ్యామ్‌దాస్ జెమ్స్ & జ్యూవెల్స్ మనీలాండరింగ్ కేసులో Enforcement Directorate (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ అగర్వాల్‌కు చెందిన ఐదు స్థిరాస్తులను Punjab National Bank (పీఎన్‌బీ)కి అప్పగించినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం వెల్లడించింది. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.16 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పీఎన్‌బీ పేరుతో నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సృష్టించి, వాటిని ఎస్‌బీఐలో సమర్పించడం ద్వారా సుమారు 250 కిలోల బంగారాన్ని మోసపూరితంగా పొందినట్లు (Sanjay Agarwal case) ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసం బయటపడిన వెంటనే, అబిడ్స్‌లోని తమ షాపులో ఉన్న బంగారాన్ని నగదుగా మార్చి, ఆ మొత్తంతో భూములు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
Read Also: Airtel-Adobe Offer: ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ
ఈడీ విచారణలో సంజయ్ అగర్వాల్ నకిలీ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లి అక్కడ కూడా లావాదేవీలు నిర్వహించినట్లు బయటపడింది. భార్య, సోదరులు, ఉద్యోగుల పేర్లతో పలు కంపెనీలు, బ్యాంక్ ఖాతాలు తెరిచి అక్రమంగా సంపాదించిన సొమ్మును మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆధారాలతో 2022లో సంజయ్ అగర్వాల్‌ను అరెస్టు చేసిన ఈడీ, మొత్తం 9 ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా కోర్టు అనుమతితో వాటిలో ఐదు ఆస్తులను పీఎన్‌బీకి అప్పగించింది. 2011లో ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో రూ.2.55 కోట్ల విలువైన ఈ భూములు, ప్రస్తుతం రూ.16 కోట్లకు పెరగడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: