📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Sameer Wankhede: బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ వివాదంలో సమీర్‌ వాంఖడేకు కోర్ట్ లో ఎదురుదెబ్బ

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 7:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఇటీవలే విడుదలై చర్చనీయాంశమైంది. యూత్ టార్గెట్ ఆడియన్స్ కోసం రూపొందించిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే సోషల్ మీడియా, మీడియాలో హాట్ టాపిక్ అయింది. సినిమా లేదా వెబ్ కంటెంట్‌కి సంబంధం లేకుండా, ఇందులో చూపించిన కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

 Actress: మంచి సినిమా తీస్తే చూడరు: హీరోయిన్

ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్‌లో ఈ – సిగ‌రెట్ (E-cigarette)వాడ‌రంటూ జాతీయ మాన‌వ హక్కుల క‌మీష‌న్ చిత్ర‌బృందానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఈ వివాదం ముగియ‌క‌ముందే సిరీస్‌పై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ అధికారి సమీర్‌ వాంఖడే దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ (Anti-Narcotics Enforcement Agency) లతో పాటు అధికారుల‌ను చెడుగా చూపించారని.. ఈ సిరీస్‌తో తన పరువుకు భంగం కలిగిందని.. అందుకు గాను ప‌రువున‌ష్టం కింద‌ రూ.2 కోట్లు చెల్లించాలని పిటిషన్ వేశారు.

Sameer Wankhede

సమీర్‌ వాంఖడేకి చుక్కెదురు

అయితే ఈ కేసు విష‌యంలో సమీర్‌ వాంఖడేకి చుక్కెదురైంది. సమీర్‌ వాంఖడే వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi)నిరాకరించింది. శుక్రవారం ఈ పిటిష‌న్‌ని విచారించిన హైకోర్టు ఈ కేసులో వాంఖ‌డే త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్ర‌శ్నిస్తూ.. ఈ పిటిష‌న్‌ని ఢిల్లీలోనే ఎందుకు విచారించాల‌ని అడిగింది. దీనిపై న్యాయవాది బదులిస్తూ ఈ సిరీస్ ఢిల్లీతో పాటు దేశ‌వ్యాప్తంగా ప్ర‌సార‌మ‌వుతుంది.

ఈ సిరీస్‌ను చూసి ప‌లువురు నెటిజ‌న్లు వాంఖ‌డేపై వ్యంగ్యంగా మీమ్స్ చేస్తున్నారు. ఇవి ఎక్కువగా ఢిల్లీలోనే క‌నిపిస్తున్నాయంటూ ధ‌ర్మాస‌నం ముందుకు తీసుకువెళ్లారు. అయితే దీనిపై కోర్టు స్పందిస్తూ.. మీరు వేసిన పిటిష‌న్ స‌రికాదు. దీనిని మేం విచారించ‌లేం. మీకు ఢిల్లీ నుంచే ఎక్కువ న‌ష్టం క‌లిగింద‌ని భావిస్తే అందుకు అనుగుణంగా పిటిష‌న్‌ని వేయండి అప్పుడు పరిగణనలోకి తీసుకుంటాం అంటూ కోర్టు వెల్ల‌డించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

aryan khan Breaking News latest news national human rights commission notice ncb former officer Shahrukh Khan Telugu News The Bads of Bollywood web series controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.