📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Samantha: రాష్ట్రపతి విందుకు సమంతకు ఆహ్వానం

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ నటి సమంతకు (Samantha) అరుదైన గౌరవం దక్కింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరైన అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన కెరీర్ లో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన అదృష్టం, మాతృభూమి వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.

Read Also: Akira Nandan: ఢిల్లీ హైకోర్టులో పవన్ కుమారుడికి ఊరట

Samantha receives an invitation to the President’s dinner.

సంప్రదాయబద్ధంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి

ఈ మేరకు ఇన్‍స్టాగ్రామ్‌లో (Samantha) ఆమె స్పందిస్తూ, “నా ఎదుగుదలలో నన్ను ప్రోత్సహించేవారు లేరు. ఎప్పటికైనా ఇలాంటి వేదికపై నిలుచుంటానని నా అంతరాత్మ కూడా చెప్పలేదు. ఎలాంటి మార్గం కనిపించలేదు. ఇలాంటి కలలు కనడానికి కూడా అప్పట్లో సాహసించలేదు. కానీ నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఈ దేశం నా కృషికి తగిన గుర్తింపు ఇచ్చింది. దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని రాసుకొచ్చారు.

ఈ కార్యక్రమానికి తేలికపాటి మేకప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రపతి భవన్‌లో దిగిన పలు ఫొటోలను, విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కూడా ఆమె షేర్ చేశారు. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Droupadi Murmu Latest News in Telugu President of India Republic Day Samantha Samantha Ruth Prabhu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.