గతకొద్ది రోజులుగా భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల రోజురోజుకు ముదిరిపోతున్నాయి. బంగ్లాదేశ్ భారత్ పై అసత్య వార్తల్ని ప్రకటిస్తూ, అక్కడి ప్రజలను రెచ్చగొట్టసాగింది. దీంతో బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని.. అత్యంత క్రూరంగా కొట్టి చంపారు. ఈ సంఘటన రెండు దేశాలమధ్య ఉద్రిక్తత మరింతగా పెంచింది. దీంతో రెండు దేశాల ప్రజలు హైకమిషన్ కార్యాలయాలపై నిరసనలు, దాడులకు దిగారు. చేసేది లేక ప్రభుత్వాలు తాత్కాలికంగా హైకమిషన్ కార్యాలయ్యాలను మూసివేయాల్సి వచ్చింది. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. (Salehuddin Ahmed) పొరుగు దేశమైన భారత్ తో సంబంధాలు చేజారిపోకుండా చూస్తామని ఆర్థిక స్థిరత్వం కోసం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ప్రభుత్వ కొనుగోళ్ల సలహా కమిటీ సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీతో సత్సంబంధానికి యూనస్ యత్నం
భారత్ వంటి పెద్ద దేశంతో శత్రుత్వం వహించడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని అహ్మద్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి.. న్యూఢిల్లీతో సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్(Muhammad Yunus) స్వయంగా కృషి చేస్తున్నారు’ అని ఆయన వెల్లడించారు. (Salehuddin Ahmed) ఇటీవల కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న భారత్ వ్యతిరేక నినాదాలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని.. వాటితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. వ్యాపార, ఆర్థిక సహకారం కొనసాగుతుందని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా భారత్ నుంచి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు అహ్మద్ ధ్రువీకరించారు. ఇది ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అభివర్ణించారు. కాగా.. పాకిస్థాన్ నుంచి కూడా మరో 50,000 టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Blue Bird Block-2: ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం
హదీ హత్యతో ముదిరిన వివాదం
ఢాకా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, తీవ్రవాద నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. విద్యార్థి సంఘాలకు నాయకుడు, తీవ్రభావజాలం గల హాదీ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా చేసిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం విధితమే. దీంతో అక్కడ నుంచి హసీనా తన ప్రాణాలను కాపాడుకునేందుకు భారత్ కు వచ్చి, ఆశ్రయం పొందుతున్నారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో హాదీ పోటీ చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారసమయంలో కాల్పులకు గురై, మరణించారు. దీంతో భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరగడంతో భారత్ వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు హిందూ కార్మికుడిని.. అత్యంత క్రూరంగా కొట్టి చంపారు. ఈ హత్యను నిరసిస్తూ న్యూఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. దీనితో బంగ్లాదేశ్ కూడా తన వీసా సేవలను నిలిపివేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: