📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Sakur Khan: మాజీ మంత్రి పీఏ అరెస్ట్

Author Icon By Sharanya
Updated: May 29, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్థాన్‌ (Rajasthan) రాజకీయ వర్గాల్లో ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన అంశం సకూర్ ఖాన్ అరెస్ట్. ఒక ప్రభుత్వ ఉద్యోగి, పైగా ఒక మాజీ మంత్రికి పీఏ(PA) గా పనిచేసిన వ్యక్తి పై పాకిస్థాన్ గూఢచర్య ఆరోపణలు రావడం, భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు నెలకొల్పుతోంది.

గూఢచర్య ఆరోపణలతో అరెస్ట్

రాజస్థాన్‌ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలోని బరోడా గ్రామానికి చెందిన సకూర్ ఖాన్ మగళియార్‌, ఉపాధి కార్యాలయంలో పనిచేస్తూ, పాకిస్తాన్‌ నిఘా సంస్థ ISIకు కీలక సమాచారం అందించాడన్న ఆరోపణలపై సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారం చేరవేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.

మాజీ మంత్రి పీఏగా పనిచేయడం

సకూర్ ఖాన్ (Sakur Khan) గతంలో ఒక మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా సకూర్ ఖాన్ పనిచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, సదరు మాజీ మంత్రి కూడా బరోడా గ్రామానికే చెందినవారు కావడం గమనార్హం.

పాక్ ప్రయాణాలు – అనుమానాస్పద నడవడి

గత కొన్ని వారాలుగా సకూర్ ఖాన్ కార్యకలాపాలపై దర్యాప్తు బృందాలు నిఘా ఉంచాయి. పాకిస్థాన్ దౌత్య కార్యాలయంతో అతనికి సంబంధాలున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి మాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకుని, ప్రశ్నించేందుకే అతడిని అరెస్ట్ చేశాం అని ఎస్పీ సుధీర్ చౌధ్రీ మీడియాకు తెలిపారు. తాను ఇప్పటివరకు ఏడుసార్లు పాకిస్థాన్ వెళ్లివచ్చినట్లు ఖాన్ విచారణలో అంగీకరించాడు.

టెక్నికల్ దర్యాప్తు – మొబైల్ లో పాక్ నంబర్లు

అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన అధికారులు అందులో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నంబర్ల గురించి ఖాన్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అతని ఫోన్‌లో ఎలాంటి సైనిక రహస్య సమాచారం లభించనప్పటికీ, కొన్ని ఫైళ్లను డిలీట్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఖాన్‌కు సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఖాన్‌కు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరగినట్లు తెలుస్తోంది. విదేశీ వనరుల నుంచి వచ్చిన నిధుల వివరాలను పరిశీలించేందుకు అధికారులు ఆఖరి ఐదేళ్ల లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

Read also: Rahul Gandhi: గిగ్ కార్మికులకు సామాజిక భద్రతపై రాహుల్ హామీ

#CorruptionCase #MinisterPAArrest #PoliceInvestigation #PoliticalScandal #Rajasthan #Sakur Khan #SakurKhan Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.