📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల స్వాధీనానికి ఉత్తర్వు!

Author Icon By Vanipushpa
Updated: January 24, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పూర్వీకులకు చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు తాజాగా కేంద్రం కూడా షాకిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులకు కొనసాగింపుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ లో పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోవడంపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తేసింది. అప్పట్లో సైఫ్ నానమ్మను ఆయన ముత్తాత అయిన హమీదుల్లా ఖాన్ కు చట్టబద్దమైన వారసురాలిగా గుర్తించింది. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ తీర్పును సమీక్షించి పాకిస్తాన్ కు వెళ్లిపోయిన ఆమె అక్క ఆబిదా సుల్తాన్ ను మాత్రమే వారసురాలిగా తేల్చింది. దీంతో సైఫ్ కుటుంబానికి దక్కాల్సిన హమీదుల్లా ఖాన్ కు చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లే పరిస్ధితి నెలకొంది.

2017లో ఈ చట్టాన్ని సవరించి వారి వారసులు కోర్టులో దీనిపై నెల రోజుల్లోగా అప్పీలు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఇప్పుడు సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపై అప్పిలేట్ అథారిటీలో సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఆలోపే మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర హోంశాఖ వీటిని శరణార్దుల ఆస్తులుగా గుర్తించింది. అంటే స్వాధీనానికి లైన్ క్లియర్ చేసింది. పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోయారు. అయితే పాకిస్తాన్ వెళ్లిపోయిన ఆబిదా సుల్తాన్ చట్టబద్ధమైన వారసురాలు అని ఆమె దేశం విడిచి శత్రుదేశానికి వెళ్లిపోయింది కాబట్టి ఆమె ఆస్తుల్ని శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం కేంద్రం స్వాధీనం చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది.

property Saif Ali Khan union home ministry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.