భారత సైనిక చరిత్రలో చారిత్రాత్మిక ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీలో నిన్న పాసింగ్ అవుట్ పరేడ్ జరిగిన విషయం తెలిసిందే. 93 ఏళ్ల ఆ అకాడమీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరారు. 93 ఐఎంఏ సంవత్సరాల చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళా ఆఫీసర్ క్యాడెట్‌గా ఈ ఘనత సాధించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి
ప్రశంసలు కురిపిస్తున్నారు
ఈ విశేష ఘనతను సాధించిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన సాయి ఎస్.జాధవ్. (Sai S Jadhav) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆరు నెలల కఠిన సైనిక శిక్షణను పూర్తి చేసుకుని భారత సైన్యంలో చేరారు. అంతే కాకుండా కొల్హాపూర్‌కు చెందిన ఆమె కుటుంబ సభ్యులు కూడా భారత ఆర్మీలో పని చేసిన వారు కావడం గమనార్హం.
సాయి (Sai S Jadhav) తాతయ్య భారత సైన్యంలో పని చేయగా.. ప్రస్తుతం ఆమె తండ్రి సందీప్ జాధవ్ కూడా ఆర్మీలో అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ముత్తాత బ్రిటిష్ సైన్యంలో సేవలందించినట్టు సమాచారం. ఇప్పుడు వారి బాటలోనే సాయి కూడా ఐఎంఏలో చేరి సైనిక అధికారిణిగా మారడం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: