हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Safest Cities in India 2025: దేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితా ఇదే!

Anusha
Safest Cities in India 2025: దేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితా ఇదే!

ప్రపంచవ్యాప్తంగా సురక్షిత దేశాలు, నగరాలపై అధ్యయనం చేసే ప్రసిద్ధ సంస్థ నంబియో (Numbeo Safety Index) తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రజల భద్రత, నేరాల తీవ్రత, మహిళలపై దాడుల రేటు, చోరీలు, దొంగతనాలు, మాదక ద్రవ్యాల వినియోగం తదితర అంశాలను ఆధారంగా తీసుకున్నారు.

ఈ నివేదికలో భారత్‌కు చెందిన పలు నగరాలు టాప్ సురక్షిత నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. రోజురోజుకు పెరిగే జనాభా, ట్రాఫిక్, నిరుద్యోగం, వరుస నేరాలు వంటి వాటి మధ్య కూడా కొన్ని నగరాలు శాంతియుత జీవనానికి అనువుగా నిలుస్తుండటం హర్షించదగిన విషయం.

మంగళూరు

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు (Mangalore) తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఇక రెండో స్థానంలో గుజరాత్‌లోని వడోదర నిలిచింది. అయితే ఈ టాప్‌ 10 జాబితాలో హైదరాబాద్‌కు మాత్రం చోటు దక్కలేదు.

అహ్మదాబాద్‌ 

ఇక సురక్షితమైన నగరాల జాబితాలో అహ్మదాబాద్‌ (Ahmedabad) మూడోవ స్థానంలో నిలవగా, అదేరాష్ట్రానికి చెందిన సూరత్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

జైపూర్‌

ఇక ఈ జాబితాలో రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్‌ ఐదో స్థానంలో నిలిచింది.

నవీ ముంబై

మహారాష్ట్ర రాజధాని అయిన నవీ ముంబై ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది.

తిరువనంతపురం

ఇక దేశంలో అత్యంత సురక్షితమైన నగరాల్లో ఏడో స్థానంలో కేరళ రాజధాని తిరువనంతపురం దక్కించుకుంది.

పూణె 

సురక్షితమైన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పూణె తొమ్మిదో స్థానాన్ని కైవసం చేసుకుంది.

చండీఘడ్‌

చండీఘడ్‌ 10వ స్థానంలో నిలిచింది. 

ఢిల్లీ 

ఇక భారత రాజధాని ఢిల్లీ మాత్రం చిట్టచివరి స్థానంలో ఉండిపోయింది.ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో భారత్‌ 67వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా 55.8 స్కోరును సాధించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870