శ్రీకాకుళం : తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం(Sabarimala) పెదంచల, వీర రామ చంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువ కులు మృతి చెందగా నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Read also: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేష్

శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో దుర్ఘటన
వీరిలో ఒకరి పరిస్థితి విష మంగాఉంది. అయ్యప్ప మాల ధరించి ఆరు గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని(Sabarimala) తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26)గా పోలీసులు గుర్తించారు. శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా కారు లారీఢీకొనడంతో జరిగినరోడ్డు ప్రమాదంలో ఇద్దరు పలాస మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు దుర్మరణం పాలవ్వడంతో వీర రామచంద్రాపురం, పెదంచల గ్రామాలలో తీవ్ర విషాదం నెలకొంది. మరొకరి పరిస్థితి విష మంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: