ప్రముఖ పర్యావరణవేత్త
ప్రకృతికి అంకితమైన జీవితం వృక్షమాత తిమ్మక్క 114 ఏళ్ల వయసులో ఇకలేరు బెంగళూరులోని(Saalumarada Thimmakka) ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసిద్ధ పర్యావరణవేత్త వృక్షమాత గా పిలువబడిన సాలుమరద తిమ్మక్క తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా జీవితం ముగిసిన ఆమె, వేలాది మొక్కలను తన పిల్లలుగా భావించి పర్యావరణానికి సేవ చేసినందుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె మరణం పర్యావరణ ఉద్యమానికి తిరగలేని లోటు అని పలువురు పర్యావరణ ప్రేమికులు, ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు.
Read also: భారీ హామీలు .. అయిన ఓటర్లను ఆకట్టుకోలేని తేజస్వి
నిస్వార్థ సేవకు అంకితం
తిమ్మక్క 1911 జూన్ 30న కర్ణాటకలోని(Karnataka) తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జన్మించారు. వివాహం తరువాత సంతానం రాకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురైన ఆమె, జీవితం మొత్తం పర్యావరణ సేవలో (Saalumarada Thimmakka) సమర్పించుకునే నిర్ణయం తీసుకున్నారు. భర్తతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మొక్కలను నాటుతూ, వాటిని కాపాడుతూ వృక్షమాతగా పేరొందారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది. అంతర్జాతీయంగా కూడా బీబీసీ 100 అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్కను చేర్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: