(S. Jaishankar) 2009 నుంచి ఇప్పటివరకు మొత్తం 18,822 మంది భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంవత్సరంలోనే 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 3,258 మంది భారత్‌కు తిరిగి పంపబడ్డారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఇటీవలి(S. Jaishankar) సంవత్సరాల గణాంకాలు మంత్రి అందించిన వివరాల ప్రకారం 2023లో 617 మంది, 2024లో 1,368 మంది, 2025లో ఇప్పటివరకు 3,258 మంది అమెరికా(America) నుంచి బహిష్కరించబడ్డారు.
ఈ సంవత్సరం తిరిగి పంపిన 3,258 మందిలో:
- 2,032 మంది (62.3%) – సాధారణ కమర్షియల్ విమానాల్లో
- 1,226 మంది (37.6%) – యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్టర్ విమానాల్లో
భారత్‌కు చేరుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read also: H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు
మానవ అక్రమ రవాణానే ప్రధాన కారణం
ఈ బహిష్కరణల(S. Jaishankar) వెనుక ప్రధానంగా మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ ఉన్నదని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ కేసులపై ఎన్ఐఏతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేపట్టాయి. పంజాబ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. ఎన్ఐఏ చర్యలు ఇప్పటివరకు 27 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసింది, 169 మందిని అరెస్ట్ చేసి 132 మందిపై ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది ఇక ఈ ఏడాది ఆగస్టు 7న హర్యానా, పంజాబ్‌ల్లో ఇద్దరు ప్రధాన ట్రాఫికర్లను, అక్టోబర్ 2న హిమాచల్ ప్రదేశ్‌లో మరో ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: