📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: RSS: సిద్ధరామయ్య కు హైకోర్టులో చుక్కెదురు

Author Icon By Sushmitha
Updated: October 28, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)(RSS) కార్యకలాపాల విషయంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆరెస్సెస్ తదితర సంస్థల కార్యకలాపాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

Read Also: ChatGPT Go: చాట్‌జీపీటీ గో’ ఫ్రీ ఎప్పటినుంచి అంటే?

ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యం, బీజేపీ ఆరోపణలు

ఆరెస్సెస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో భారీస్థాయిలో కవాతులు నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే సిద్ధరామయ్య(Siddaramaiah) ప్రభుత్వం అక్టోబర్ 18న ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు, సంఘాలు తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ మైదానాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల ఆవరణలను వినియోగించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. అయితే, రాష్ట్రంలో ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించే ఉద్దేశంతోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఆరెస్సెస్ కార్యకలాపాలపై జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు ఏమి చేసింది?

ఆ ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం మధ్యంతర స్టే విధించింది.

ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పుడు జారీ అయ్యాయి?

కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 18న ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Karnataka Government Karnataka High Court political controversy. RSS Siddaramaiah

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.