భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని, పొరుగు దేశాలతో సఖ్యతతో మెలగాలని ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) పేర్కొన్నారు. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్ మాత్రం మనతో శాంతియుతంగా ఉండాలని అనుకోవడం లేదని ఆయన ఆరోపించారు. భారత దేశానికి హాని కలిగించడం ద్వారానే పాక్ సంతృప్తి చెందుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ శాంతి కోరుకోవడం సరికాదని, పాక్‌కు అర్థమయ్యే భాషలోనే జవాబు ఇవ్వడం మంచిదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: TTD: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు
శాంతిని కోరుకోని వారికి అశాంతిని రుచి చూపించాలి
మోహన్ భగవత్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌కు నష్టం కలిగేలా ప్రతిసారీ ఓడిస్తూనే ఉండాలని చెప్పారు. అప్పుడు పాక్ శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదని అన్నారు. శాంతిని కోరుకోని వారికి అశాంతిని రుచి చూపించడం ద్వారానే బుద్ధి చెప్పాలని అన్నారు. 1971లో భారత సైన్యం ధాటికి పాకిస్థాన్ 90 వేల మంది సైనికులను కోల్పోయిందని, అయినా సరే ఆ దేశ పాలకులకు బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు.
పాక్‌కు భగవత్ హితవు, దేశానికి సూచన
భారత్‌ను తాము చేయగలిగింది ఏమీలేదని పాక్‌కు అర్థమయ్యే వరకు ప్రతి దాడి చేయాలని మోహన్ భగవత్ సూచించారు. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజాయతీగల స్నేహితుడిగా భారత్‌కు సహకరిస్తేనే మీకు మేలు కలుగుతుందని పాకిస్థాన్‌కు ఆయన హితవు పలికారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: