న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను(RSS) నిషేధించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఆరెస్సెస్ పై మల్లికార్జున ఖర్గే స్పందన) పునరుద్ఘాటించారు. దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించారని ఆయన గుర్తుచేశారు. దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి ఆరెస్సెస్ మరియు బీజేపీలే కారణమని ఆయన ఆరోపించారు.
Read Also: CBSE Exam: సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల టైం టేబుల్
పటేల్, గాంధీ హత్యపై వ్యాఖ్యలు
శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ వంటి నాయకులు దేశానికి, జాతి ఐక్యతకు గొప్ప సేవలు చేశారని కొనియాడారు. ఆరెస్సెస్ భావజాలం విషంతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆరెస్సెస్ సృష్టించిందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్.. శ్యాంప్రసాద్ ముఖర్జీకి లేఖ రాశారని తెలిపారు. పటేల్, నెహ్రూ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ వారి మధ్య చీలిక తేవడానికి ఆరెస్సెస్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.
మోదీ ఆరోపణలపై ఖర్గే స్పందన
కశ్మీర్ మొత్తాన్ని భారతదేశంలో కలపాలని పటేల్ అనుకున్నా, నెహ్రూ ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన ఆరోపణలపై ఖర్గే పైవిధంగా స్పందించారు. మరోవైపు, ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కూడా స్పందించింది. దశాబ్దాల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కాంగ్రెస్ ఎందుకు విస్మరించిందని బీజేపీ ప్రశ్నించింది.
ఆరెస్సెస్‌పై మల్లికార్జున ఖర్గే చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?
దాని భావజాలం విషంతో సమానమని, మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆరెస్సెస్ సృష్టించిందని ఆయన ఆరోపించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విషయంలో నిషేధం విధించారు?
ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా పటేల్ నిషేధం విధించారని ఖర్గే గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: