📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: RSS Chief – అదనపు సుంకాలపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 8:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సమాజంలోని విలువలు, ఆధ్యాత్మికత, సాంప్రదాయాలు ఆధారంగా దేశ అభివృద్ధి కొనసాగాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ (Mohan Bhagwat) అభిప్రాయపడ్డారు. మనమందరం ఒకే భగవంతుడి సంతానమని గ్రహించగలిగితే సమాజంలో ఎలాంటి విభేదాలు, అసురక్షిత భావాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నాగ్‌పూర్‌లో జరిగిన బ్రహ్మకుమారీల ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ – “భారత్ వేగంగా ఎదుగుతోంది. ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తులు ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నాయి” అని అన్నారు. వాణిజ్యం సజావుగా సాగితేనే అన్ని దేశాలు ప్రయోజనం పొందుతాయని, అదనపు సుంకాలు లేదా కఠిన విధానాలు వాణిజ్యాన్ని అడ్డుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కొన్ని దేశాలు భారతీయ ఉత్పత్తులపై అధిక టారీఫ్‌ (tariff) లు విధించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆయన పరోక్షంగా విమర్శించారు.

పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు

శుక్రవారం నాగ్‌పూర్‌లో బ్రహ్మకుమారీల కార్యక్రమానికి మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా జరగాలని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. అయితే, 50 శాతం అదనపు టారీఫ్‌లపై అమెరికా పేరు ప్రస్తావించకుండానే భగవత్ చురకలు అంటించారు.మన మధ్య శత్రుత్వం లేకపోతే ఎవరూ శత్రువులు కాదు..గతంలో పాములను చూస్తే భయపడేవాళ్లం.. కానీ, జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని పాములూ విషపూరితం కాదని తెలుసుకున్నాం.. అప్పుడు ఆ పాములను అలాగే వదలిపెట్టడం మొదలుపెట్టాం..

RSS Chief

జ్ఞానం వల్ల భయం, వివక్ష అన్నీ తొలగిపోయాయి’’ అని అన్నారు. ‘‘భారత్ అభివృద్ధి చెందితే ఏం అవుతుంది? అందుకే సుంకాలు విధిస్తారా? సప్త సముద్రాల ఆవల ఉన్న మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? కానీ, ‘నేను.. నాది’ అనే భావనతో భయపడుతున్నారు.. కానీ, ఈ రోజు ప్రపంచానికి పరిష్కారం అవసరం.. మీరు అసంపూర్ణ దృక్కోణంతో పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు అందుకే విఫలమయ్యారు’’ అని పరోక్షంగా అమెరికా (America) పై విమర్శలు గుప్పించారు.అంతర్జాతీయ వాణిజ్యం ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛంగా స్వచ్ఛంద సహకారంపై ఆధారపడి ఉండాలి..

దిగుమతులు కొనసాగుతాయి

అందుకే మనం స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.. ఆత్మనిర్బర్ (Atmanirbar) అంటే దిగుమతులు నిలిపివేయడం కాదు.. ప్రపంచం పరస్పర ఆధారంతో నడుస్తోంది.. కాబట్టి ఎగుమతులు.. దిగుమతులు కొనసాగుతాయి.. కానీ, వాటిలో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు’’ అని పేర్కొన్నారు. భారత్‌పై తొలుత 25 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) … రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందనే సాకుతో అదనంగా మరో 25 శాతం సుంకాలు కలిసి 50 శాతం విధించారు.

ఈ చర్యలతో భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.అయితే, గత నాలుగైదు రోజులుగా ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చినట్టు సంకేతాలు కూడా వచ్చాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, అవి విజయవంతంగా ముగుస్తాయని తాను ఆశిస్తున్నానని ట్రంప్ తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. తాను కూడా ట్రంప్‌తో చర్చలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బదులిచ్చారు. ఈ క్రమంలో భారత్, అమెరికాల మధ్య ఆరో దశ వాణిజ్య చర్చలు త్వరలోనే జరగునున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/shashi-tharoor-5/national/546170/

Brahma Kumaris Extra Duties Global Trade India Growth Mohan Bhagwat Nagpur Event RSS Trade Tariffs US tariff criticism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.