దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక తీపి కబురు అందించబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల కోసం ఈ ఏడాది వడ్డీ రేట్లను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గతేడాది ఉన్న 8.25 శాతం వడ్డీని ఈసారి 8.35 శాతానికి పెంచే అవకాశం ఉంది. అంటే సుమారు 0.10 శాతం పెరుగుదల ఉండవచ్చు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, సుమారు 8 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. రూ. 35,000 వడ్డీ ఎలా వస్తుంది? చాలామందికి తమ పీఎఫ్ (PF) ఖాతాలో వడ్డీ ఎలా లెక్కించబడుతుందనే సందేహం ఉంటుంది. ఉదాహరణకు, మీ పీఎఫ్ ఖాతాలో రూ. 4 లక్షల నిల్వ ఉందనుకుందాం. ప్రభుత్వం వడ్డీ రేటును 8.35 శాతానికి పెంచితే, మీకు ఏడాదికి సుమారు రూ. 33,400 నుండి రూ. 35,000 వరకు వడ్డీ లభిస్తుంది. అదే మీ ఖాతాలో రూ. 5 లక్షలు ఉంటే, ఆ వడ్డీ మొత్తం రూ. 43,000 వరకు ఉండవచ్చు.
Read Also: Yash: ‘టాక్సిక్’ మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?
ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు
ఈ వడ్డీ మీ ఖాతాలో ఉన్న మొత్తం నిల్వ ఆధారంగా లెక్కించబడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు; ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ మొత్తం నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ వడ్డీ రేట్ల పెంపుపై తుది నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో తీసుకోనున్నారు. మార్చి నెల మధ్యలో, అంటే హోలీ పండుగ తర్వాత ఈ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ మార్చిలో ప్రకటన వస్తే, జూన్ నెల నాటికి చందాదారులందరి ఖాతాల్లో వడ్డీ డబ్బులు కనిపిస్తాయి. అప్పుడు మీ ఈపీఎఫ్ పాస్‌బుక్ చెక్ చేసుకుంటే అప్డేట్ అయిన బ్యాలెన్స్‌ను చూడవచ్చు. మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా? మీ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి: 1. EPFO వెబ్‌సైట్ ద్వారా: అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి, మీ UAN నంబర్ , పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. అక్కడ “Member Passbook” ఆప్షన్ ఎంచుకుంటే పూర్తి వివరాలు కనిపిస్తాయి. 2. SMS ద్వారా: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి దీర్ఘకాలిక భద్రతకు భరోసా పీఎఫ్ అనేది ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే కీలకమైన పొదుపు పథకం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: