GST Noice : కుండలు అమ్మే వ్యక్తికి రూ. 1.25 కోట్ల GST నోటీస్..అసలు ఏంజరిగిందటే !!

Read Time:  1 min
GST Noice : కుండలు అమ్మే వ్యక్తికి రూ. 1.25 కోట్ల GST నోటీస్..అసలు ఏంజరిగిందటే !!
FONT SIZE
GET APP

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో వెలుగుచూసిన ఈ ఘటన సామాన్యులను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, సైబర్ నేరగాళ్లు ఎంత దారుణంగా అమాయకులను బలిపశువులను చేస్తున్నారో అర్థం పడుతోంది. రోజువారీ కూలి చేసుకుంటూ, కేవలం రెండు రూపాయల విలువ చేసే మట్టి కుండలు అమ్ముకుంటూ జీవించే సయీద్ అనే వ్యక్తికి జీఎస్టీ అధికారుల నుంచి వచ్చిన నోటీసు పిడుగులా తగిలింది. ఆ నోటీసులో ఆయన రూ. 1.25 కోట్ల పన్ను చెల్లించాలని ఉండటంతో సయీద్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దర్యాప్తులో ఆయన పేరు మీద ఏకంగా నాలుగు బోగస్ కంపెనీలు నమోదై ఉన్నాయని, వాటి ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు తేలింది. తినడానికే తిండిలేని తనలాంటి వ్యక్తి పేరు మీద కోట్ల వ్యాపారం ఎలా జరుగుతుందని ఆయన వాపోతున్నారు. పాన్ మరియు ఆధార్ కార్డుల వంటి వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కావడం వల్లే ఇలాంటి “ఐడెంటిటీ థెఫ్ట్” (గుర్తింపు దొంగతనం) నేరాలు జరుగుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?

గతంలో సయీద్ ఏదో చిన్న అవసరం నిమిత్తం లోన్ కోసం తన ఆధార్, పాన్ కార్డు కాపీలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు, ఆయనకు తెలియకుండానే జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేసి, భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఆర్థిక వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ పేదలను ఎలా ఇరికించవచ్చో అర్థమవుతోంది. ప్రస్తుతం సయీద్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సామాన్యులు తమ కేవైసీ (KYC) పత్రాలను ఇతరులకు ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం ఒక గుణపాఠం. ఇలాంటి సందర్భాల్లో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మరియు తన పాన్ కార్డు ద్వారా ఎక్కడైనా ఇతర వ్యాపారాలు జరుగుతున్నాయో లేదో చెక్ చేసుకోవడం అత్యంత ముఖ్యం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.