దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది యువతకు ఇది పెద్ద అవకాశంగా మారింది. ముఖ్యంగా పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
Read Also: ISRO: ఈరోజు బహుబలి రాకెట్ ప్రయోగించనున్న ఇస్రో
అర్హతలు
(RRB) ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది. 18-33 ఏళ్ల వయసున్నవారు అర్హులు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అటు కేంద్ర బలగాల్లో 25,487 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: