📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tamil Nadu Elections: తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

Author Icon By Anusha
Updated: March 2, 2026 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tamil Nadu Elections: తమిళనాడు శాసనసభ ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా తమిళ రాజకీయాల్లో మెరిశారు. మార్చి 1న తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమికి తన పూర్తి మద్దతును ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.

Read Also: Andhra Pradesh: మహానంది ఆలయానికి విజయవాడ భక్తురాలి భారీ విరాళం

స్టాలిన్ పథకాలపై ప్రశంసలు: మహిళా సాధికారతకు నిదర్శనం

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకాశానికెత్తారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రతినెలా వారి ఖాతాల్లో 1000 రూపాయలు నేరుగా జమ చేయడం విప్లవాత్మకమైన నిర్ణయమని ఆమె కొనియాడారు.అలానే ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా మహిళలకు డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు అయినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.

Roja campaigning on behalf of DMK in Tamil Nadu?

దీంతో త్వరలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే పార్టీ తరపున రోజా ప్రచారం చేయనున్నారా అని జోరుగా చర్చ నడుస్తోంది.ప్రచారం చేయడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై రోజా స్పందించారు. తాను కేవలం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసమే వెళ్లినట్టు స్పష్టం చేశారు. మంత్రి చంద్రశేఖర్ తనకు అత్యంత ఆప్తులని, కుటుంబ సభ్యుడు లాంటి వారని చెప్పుకొచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు మాత్రమే వెళ్లానని.. అక్కడ రాజకీయాలకు తావు లేదన్నారు. తాను ఎటువంటి ప్రచారంలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

CM Stalin Birthday DMK vs AIADMK 2026 rk roja Roja Criticizes Chandrababu Naidu tamil nadu elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.