ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) తన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ కుటుంబ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని, ఇందుకు బయటి వ్యక్తులు అవసరం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ గౌరవాన్ని, ఉనికిని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు.
Read also: New Plan: మరింత చవక ప్లాన్ తో ఎయిర్ టెల్
వినాశక శక్తులకు దారి తీస్తాయి
కుటుంబ గౌరవాన్ని, ఉనికిని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది తననెంతో షాక్‌కు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. అజ్ఞానం, అహంకారం వినాశక శక్తులకు దారితీస్తాయని ఆమె వ్యాఖ్యానించారు.లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కుటుంబం నుంచి బహిష్కరించడంపై రోహిణి (Rohini Acharya) అసంతృప్తితో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత ఆమె తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: