కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు షికోహ్‌పూర్ భూ ఒప్పందాల కేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు(Delhi Court) నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. ఈ మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాతో పాటు మొత్తం 11 మందికి కోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున వాద్రా తన వాదనలను కోర్టు ముందు వినిపించాల్సి ఉంటుంది.
రాబర్ట్ వాద్రా సహా పలువురిపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు
గురుగ్రామ్‌లోని షికోహ్‌పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమిని అక్రమ మార్గాల్లో కొనుగోలు చేశారనే ఆరోపణలపై రాబర్ట్ వాద్రా సహా పలువురిపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ లావాదేవీల ద్వారా వచ్చిన నేరపూరిత ఆదాయాన్ని వాద్రా నియంత్రణలో ఉన్న పలు కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, వాద్రాకు చెందిన మెసర్స్ స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఇతర ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. వాటి మొత్తం విలువ రూ. 37.64 కోట్లుగా పేర్కొంది.
తీవ్ర వివాదానికి దారితీసిన భూమి
ఈ కేసుకు మూలం 2008లో గురుగ్రామ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్. మెసర్స్ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాద్రా కంపెనీ తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 7.5 కోట్లకు భూమిని కొనుగోలు చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2012లో, అదే భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు రూ. 58 కోట్లకు విక్రయించడం తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పట్లో హర్యానాలో ల్యాండ్ కన్సాలిడేషన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అశోక్ ఖేమ్కా, రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ భూమి మ్యుటేషన్‌ను రద్దు చేశారు. ఆయన నిర్ణయం అప్పట్లో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. అప్పటి నుంచి ఈ భూ ఒప్పందంపై న్యాయపరమైన, పరిపాలనపరమైన దర్యాప్తు కొనసాగుతోంది. తాజా పరిణామంతో ఈ కేసు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది .
ఈ రాబర్ట్ వాద్రా ఎవరు?
ఆయన వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త. ఆయన భారత మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీల అల్లుడు మరియు రాహుల్ గాంధీకి బావమరిది.
Read hindi news: hindi.vaartha.com
Read also