Revolt Motors: బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

Read Time:  1 min
Revolt Motors: బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా
FONT SIZE
GET APP

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సంస్థ (Revolt Motors) రివోల్ట్ మోటార్స్. గురువారం ఢిల్లీలో కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా యువతను, ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ కోరుకునే వారిని ఆకట్టుకోవాలని, తద్వారా దేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల వినియోగాన్ని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ సందర్భంగా రతన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ఛైర్‌పర్సన్ అంజలి రతన్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా ఆధునిక భారతదేశ స్ఫూర్తికి ప్రతీక. ఆయన ధైర్యవంతుడు, భవిష్యత్తు వైపు చూసే వ్యక్తి. మేము కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడం లేదు, బాధ్యతాయుతమైన రవాణా వ్యవస్థ వైపు ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం అని అన్నారు.

Read Also: Actress Jaya Vahini: టాలీవుడ్‌ నటి వాహిని కన్నుమూత

Revolt Motors: బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా
Hardik Pandya as brand ambassador

కొత్త ఆలోచనలకు ఎప్పుడూ మద్దతిస్తానన్న పాండ్యా

సాధారణ పద్ధతులను సవాలు చేసే కొత్త ఆలోచనలకు నేను ఎప్పుడూ మద్దతిస్తాను. రివోల్ట్ సంస్థ ఎలక్ట్రిక్ రైడింగ్‌ను ఉత్సాహభరితంగా మార్చి మొబిలిటీపై మనకున్న అభిప్రాయాన్ని మారుస్తోంది” అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.

2017లో ప్రారంభమైన (Revolt Motors) రివోల్ట్ మోటార్స్, దేశంలో ఏఐ (AI) ఆధారిత మోటార్‌సైకిళ్లను పరిచయం చేసిన మొదటి సంస్థగా గుర్తింపు పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా హార్దిక్ పాండ్యా త్వరలో ప్రారంభం కానున్న డిజిటల్, సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటాడు. హార్దిక్ పాండ్యాకున్న క్రేజ్‌తో దేశంలో గ్రీన్ మొబిలిటీ ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రివోల్ట్ మోటార్స్ అనేది బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయిన రతన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో భాగంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.