గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా రూపొందిన ఏఐ వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకవేళ మన స్వాతంత్య్ర పోరాట యోధులు నేటి కాలంలోకి తిరిగి వస్తే వారి స్పందన ఎలా ఉంటుందో ఈ వీడియోలో సృజనాత్మకంగా ఆవిష్కరించారు.
Read Also: Republic Day 2026 : అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం
మహానీయులతో త్రివర్ణ పతాక ఆవిష్కరణ
మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వంటి మహానుభావులు ఒకే వేదికపై కనిపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక భారత దేశాన్ని చూసి వారు గర్వంతో చిరునవ్వులు చిందిస్తున్నట్లు వీడియో(AI Video)ను రూపొందించారు. దేశభక్తి భావాలను మరింత బలపరిచేలా ఉన్న ఈ వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతూ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: