Narendra Modi : దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీకగా ప్రధాని Narendra Modi అభివర్ణించారు. కర్తవ్యపథ్‌లో జరిగిన ఈ వేడుకలు భారత ప్రజాస్వామ్య బలం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పాయని ఆయన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత భద్రతా వ్యవస్థల సామర్థ్యం అద్భుతంగా ప్రదర్శితమైందని ప్రధాని ప్రశంసించారు. దేశ సంసిద్ధత, సాంకేతిక ప్రగతి, పౌరుల రక్షణ పట్ల ఉన్న అచంచల నిబద్ధత ఈ పరేడ్‌లో స్పష్టంగా కనిపించిందని అన్నారు. మన సాయుధ దళాలు నిజంగా దేశానికి గర్వకారణమని కొనియాడారు.
Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ
వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని (Narendra Modi) జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి Droupadi Murmu జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు Ursula von der Leyen, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు Antonio Costa ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పరేడ్ ముగిసిన అనంతరం సంప్రదాయాలను పక్కనపెట్టి ప్రధాని కర్తవ్యపథ్‌పై నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేయడం మరోసారి ఆకట్టుకుంది. త్రివర్ణ పతాకాలు పట్టుకున్న ప్రజలు ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ–మోదీ’ నినాదాలతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. రాజస్థానీ తలపాగా, నెమలి ఈకల అలంకరణతో ప్రధాని ప్రత్యేక వస్త్రధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: