భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2026) ఘనంగా జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కల్నల్ ఫ్రెడ్రిక్ సైమన్ నేతృత్వంలో ఐరోపా సమాఖ్యకు చెందిన నలుగురు ఫ్లాగ్ బేరర్స్‌తో వందనం స్వీకరించారు.
Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
శుభాంషు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
కెప్టెన్ అహాన్ కుమార్ నేతృత్వంలో 61 కావలరీ వందన సమర్పణ చేశారు. భారత వ్యోమగామి, ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లాకు భారతదేశపు అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన అశోక చక్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.అలాగే గగన్‌యాన్ యాత్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు ‘కీర్తి చక్ర’ను అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com