📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Republic Day 2026: CRPF బృందానికి క‌మాండెంట్‌గా మ‌హిళా ఆఫీస‌ర్‌

Author Icon By Aanusha
Updated: January 19, 2026 • 9:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించనున్న ఆర్డీ పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్ మార్చింగ్ బృందానికి సిమ్రన్ బాలా కమాండర్‌గా వ్యవహరించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా ఆమె దేశవ్యాప్తంగా మహిళలకు ప్రేరణగా నిలవనున్నారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే 140 మంది పురుషులతో కూడిన సీఆర్‌పీఎఫ్ మార్చింగ్ బృందానికి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న సిమ్రన్ బాలా, పారామిలిటరీ దళంలో ఆఫీసర్ ర్యాంక్‌లో చేరిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె యూపీఎస్సీ CAPF అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

Read Also: Davos : పెట్టుబడుల వేటలో తెలుగు రాష్ట్రాల సీఎంలు!

Republic Day 2026: A woman officer to serve as Commandant of the CRPF contingent

పొలిటిక‌ల్ సైన్స్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి

దేశంలోని అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు చెందిన సీఆర్పీఎఫ్ ద‌ళంలో సుమారు 3.26 ల‌క్ష‌ల సిబ్బంది ఉన్నారు. యాంటీ న‌క్స‌ల్స్ ఆప‌రేష‌న్స్‌, జ‌మ్మూక‌శ్మీర్‌లో కౌంట‌ర్ టెర్ర‌రిజం, ఈశాన్య రాష్ట్రాల్లో చొర‌బాటు ఏరివేత‌ల టార్గెట్‌గా సీఆర్పీఎఫ్ ద‌ళాలు ప‌నిచేస్తున్నాయి.జ‌మ్మూలోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న ప్ర‌భుత్వ మ‌హిళా కాలేజీలో సిమ్ర‌న్ బాలా పొలిటిక‌ల్ సైన్స్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.

2025 ఏప్రిల్‌లో ఆమె సీఆర్పీఎఫ్ ద‌ళంలో చేరింది. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌స్త‌రియా బాటాలియ‌న్‌లో ఆమె తొలి పోస్టింగ్‌. యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న‌ది. శిక్ష‌ణ స‌మ‌యంలో సీఆర్పీఎఫ్ అకాడ‌మీలో ఆమె బెస్ట్ ఆఫీస‌ర్ అవార్డు గెలుచుకున్న‌ది. యూపీఎస్సీ నిర్వ‌హించే సీఏపీఎఫ్ అసిస్టెంట్ క‌మాండెంట్స్ ప‌రీక్ష‌లో ఆమె క్వాలిఫై అయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CRPF Marching Contingent latest news Republic Day parade Simran Bala Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.