📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు నివేదిక

Author Icon By Sharanya
Updated: February 13, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికను జేపీసీ చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్‌ తదితరులు సభలో ప్రవేశపెట్టారు. ఈ ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు.

విపక్షాల నిరసన:
రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలిపారు. వారు తమ డిస్సెంట్ ‌(అసమ్మతి) నోట్‌ను తొలగించినట్లు ఆరోపించారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మతస్వేచ్చాను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. అనంతరం విపక్ష సభ్యులు డీఎంకే ఎంపీ కనిమొళి కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ ఇండియన్ముయూనియన్ ముస్లిం ఎంపీ బషీర్ బిల్లును వ్యతరేకించారు.ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ 20 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

నివేదికలో ప్రధాన సవరణలు:

ముస్లిం ఓబీసీ సభ్యుల నియామకం: రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు.ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.
ప్రత్యేక వక్ఫ్‌ బోర్డులు: రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్‌ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలలో ఉన్నాయి.
వక్ఫ్‌ అలాల్‌ ఔలాద్ (కుటుంబ వక్ఫ్‌లు): మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు.

ముసాయిదా బిల్లు ఆమోదం:
జనవరి 29న ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 15-11 మెజారిటీతో ఈ నివేదిక ఆమోదించబడింది. కమిటీ ఆమోదించిన సవరణలను బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, ఆప్‌, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిస్సెంట్‌(అసమ్మతి) నోట్‌ను సమర్పించారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా, ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్‌ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.

#PoliticalDebate #rajyasabhaapproval #waqfamendementbill #waqfbill2024 Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.