📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest Telugu news : Reorganization of States – రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ: మహత్తర ఘట్టం

Author Icon By Sudha
Updated: September 30, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (Reorganization of States)ఒక రాజకీయ, సాంస్కృతిక, పరిపాలనా ప్రస్థానమే కాక, దేశ సమాఖ్య నిర్మాణానికి పునాది (foundation)వేసిన చారిత్రాత్మక పరి ణామం. బ్రిటీష్ పాలనలో ఏర్పడిన ప్రావిన్సులు, సంస్థా నాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వాతంత్ర్యం వచ్చిన తరు వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేవు. ఆ విభజన లో పార్ట్ ఏ లోని అస్సాం, బీహార్, బొంబాయి, తూర్పు పంజాబ్, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి బ్రిటీష్ ప్రావిన్సులు, పార్ట్ బిలోని సంస్థానాలు, పార్ట్ లోని చిన్న ప్రాదేశిక పాలనాయూనిట్లు, పార్ట్ డి వంటి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ సామ్రాజ్య అవసరాల ఆధారంగా కూర్చబడ్డాయి. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ప్రజలలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకై డిమాండ్లు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ 1920లో నాగపూర్ సమావేశంలోనే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. అయితే దేశ విభజనలో జరిగిన రక్తపాతం, వలసల కల్లోలం దృష్ట్యా నెహ్రు , పటేల్ వంటి నాయకులు కొత్త రాష్ట్రాల ఏర్పాటులో జాగ్రత్త వహించారు. 1948లో ఏర్పాటు చేసిన ధార్ కమిషన్, తదనంతరం నెహ్రూ, పటేల్, పట్టాభి సీతా రామయ్యలతో కూడిన జేవీపీ కమిటీలు భాషా ప్రాతిపదిక సరికాదని, ఇప్పుడే రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడం (Reorganization of States)సమంజసం కాదని తేల్చాయి. కానీ ప్రజల ఆకాంక్షలు ఆగలేదు. తెలుగు ప్రాంత ప్రజలు తమ రాష్ట్రం కోసం గళమెత్తారు. పొట్టి శ్రీరాములు 1952లో ఆంధ్రరాష్ట్రం కోసం చేపట్టిన నిరాహార దీక్షలో 58 రోజుల తరువాత ప్రాణత్యాగం చేయడం ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఆ త్యాగ ఫలితంగా 1953 అక్టోబర్ 1న మద్రాస్ నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

Reorganization of States – రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ: మహత్తర ఘట్టం

ఇది స్వతంత్ర భారత దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం. ఈ పరిణామం ఇతర భాషా ప్రాంతాలకూ స్పూర్తినిచ్చింది. మహారాష్ట్ర కోసం మరాఠీలు, గుజరాత్ కోసం గుజరాతీలు, పంజాబ్ కోసం సిక్కులు, మైసూరు కోసం కన్నడిగులు ఉద్యమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1953 డిసెంబర్ 29న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించింది. న్యాయమూర్తి ఫజల్ అలీ అధ్యక్షతన, సభ్యులు పణిక్కర్, కుంజ్రూ పాల్గొన్న ఈ కమిషన్ 1955 సెప్టెంబర్ 30న నివేదిక సమర్పించింది. ఇందులో పార్ట్ ఎ, బి, సి వర్గీకరణలు రద్దు చేయాలని, సంస్థానాల ప్రత్యేక హక్కులు తొలగించాలని, చిన్న రాష్ట్రా లను విలీనం చేయాలని, భాషా, భౌగోళిక, ఆర్థిక అంశాల ను సమన్వయం చేస్తూ రాష్ట్రాల కొత్త రూపకల్పన జరగా లని సూచించింది. ఈ నివేదిక ఆధారంగా 1956లో పార్ల మెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించి, ఏడో సవరణ రాజ్యాంగంలో అమలులోకి తెచ్చింది. 1956 నవంబర్ 11956 నవంబర్ 1న 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ పునర్వ్యవస్థీకరణ (Reorganization of States)లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. భాషా ప్రాతిపది కన రాష్ట్రాల ఏర్పాటు ప్రజల్లో సాంస్కృతిక, భాషా గౌర వాన్ని బలపరిచింది. స్థానిక సమస్యల పరిష్కారానికి సమ ర్థవంతమైన పాలన సాధ్యమైంది. కానీ ఈ ప్రక్రియలో ప్రాంతీయత, విభజన వాదనలు కూడా పుంజుకున్నాయి. బొంబాయి రాష్ట్ర విభజనలో మహారాష్ట్ర గుజరాత్, పంజాబ్ విభజనలో భాషామత సమస్యలు, అస్సాం విభజనలో ఈశాన్య గుర్తింపు కోసం ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రజాస్వామ్య పటి ష్టతకు దోహదపడింది. రాష్ట్రాలు వరుసగా ఏర్పాటులో మహారాష్ట్ర, గుజరాత్ 1960లో, నాగాలాండ్ 1963లో, హర్యానా 1966లో, మణిపూర్, త్రిపుర, మేఘాలయం 1972లో, సిక్కిం 1975లో, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ 1987లో, గోవా అదే ఏడాది, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ 2000లో, తెలంగాణ 2014లో ఏర్పడ్డాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. ప్రస్తుతానికి దేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఒక నిరంతర ప్రక్రియ. ఇది ప్రజల ఆకాం క్షలు, ప్రాంతీయ అవసరాలు, రాజకీయ పరిణామాలు కలగ లసిన జీవం. భాషా గౌరవం,స్థానిక అభివృద్ధి, పాలనా సమర్థత వంటి లాభాలు లభించినప్పటికీ వనరుల పంచిక, ప్రాంతీయ వాదనలు వంటి సవాళ్లుకూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ ఫజల్ అలీ కమిషన్ నివేదిక, 1956 చట్టం, పొట్టి శ్రీరాములు త్యాగంవంటి ఘట్టాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో అచంచలంగా నిలిచిపోయాయి. రాష్ట్రాల పునర్వ్య వస్థీకరణ ప్రజల భాషాసాంస్కృతిక వ్యక్తిత్వానికి, సమాఖ్య ఐక్యతకు అద్దం పట్టిన చారిత్రక ఘట్టమని చెప్పాలి.
-రామ కిష్టయ్య సంగన భట్ల

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి?

1956 నవంబర్‌లో ఆమోదించబడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం దేశాన్ని 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

1956 లో భారతదేశం యొక్క రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు ప్రధాన ప్రాతిపదిక ఏమిటి?

భాషా మరియు సాంస్కృతిక ఏకరూపత. 1956 సంవత్సరంలో భాషా మరియు సాంస్కృతిక ఏకరూపత ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. స్వాతంత్ర్యం తర్వాత, 571 రాచరిక రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడి, 27 రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి కలిసి విలీనం చేయబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/breaking-news/october-1st-key-financial-railway-online-rules-changed/557159/

Breaking News Indian History Indian States latest news Linguistic States State Reorganization States Reorganisation Act Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.