Mango Fruits: అద్దెకు మామిడి చెట్లు. ..90 కిలోల పండ్లు మీ సొంతం..!

Read Time:  1 min
అద్దెకు మామిడి చెట్లు. ..90 కిలోల పండ్లు మీ సొంతం..!
అద్దెకు మామిడి చెట్లు. ..90 కిలోల పండ్లు మీ సొంతం..!
FONT SIZE
GET APP

నాణ్యమైన పండ్లు: సాధారణంగా మార్కెట్‌లో దొరికే మామిడి పండ్ల(Mango Fruits)ను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను వాడుతుంటారు. కానీ, ఇలా చెట్టును అద్దెకు తీసుకోవడం వల్ల ఎటువంటి రసాయనాలు లేని, సహజంగా పండిన నాణ్యమైన పండ్లను నేరుగా తోట నుండే పొందే అవకాశం ఉంటుంది.

Read Also: RRB ALP recruitment 2026 : రైల్వేలో భారీ నోటిఫికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

Mango Fruits: Mango trees for rent. ..90 kg of fruits are yours..!
Mango Fruits: Mango trees for rent. ..90 kg of fruits are yours..!

రకాలు (Varieties):

ఈ విధానంలో అల్ఫోన్సో (Alphonso), కేసర్ (Kesar), ఇమామ్ పసంద్ మరియు మల్గోవా వంటి ఖరీదైన రకాలను కూడా అద్దెకు ఇస్తున్నారు. మీరు ఎంచుకునే రకాన్ని బట్టి అద్దె ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. చెట్టును అద్దెకు తీసుకున్న వారికి ఆ తోట యజమాని ఎప్పటికప్పుడు చెట్టు ఎదుగుదల, పూత మరియు కాయ దశల ఫోటోలను లేదా వీడియోలను పంపిస్తుంటారు. దీనివల్ల కస్టమర్లకు తమ చెట్టుపై నమ్మకం కలుగుతుంది. వీలుంటే అద్దెకు తీసుకున్న వారు తమ కుటుంబంతో కలిసి తోటకు వెళ్లి, స్వయంగా పండ్లను కోసుకునే సదుపాయాన్ని కూడా కొన్ని తోటల యజమానులు కల్పిస్తున్నారు. ఇది పిల్లలకు ప్రకృతిపై అవగాహన కల్పించే ఒక విహారయాత్రలా ఉపయోగపడుతుంది. సాధార‌ణంగా మామిడి పండ్లు వేస‌వి కాలంలోనే అందుబాటులో ఉంటాయి. ఉగాది నుంచి మొద‌లుకుంటే జూన్ వ‌ర‌కు అంటే దాదాపు మూడు నెల‌ల పాటు మామిడి పండ్లు కాస్తాయి. ఈ మూడు నెల‌ల్లో ఒక్కో చెట్టు 90 కిలోల వ‌ర‌కు దిగుబ‌డి సాధిస్తుంది. అంటే రూ. 10,300 చెల్లించి 90 కిలోల మామిడి పండ్ల‌ను పొందొచ్చ‌న్న మాట‌.

ఈ మూడు రాష్ట్రాల్లోనూ కిరాయికి మామిడి చెట్లు..!

త‌మిళ‌నాడులోని కొచ్చిలోనే కాకుండా.. మ‌హారాష్ట్ర‌, కేర‌ళ రాష్ట్రాల్లోనూ మామిడి చెట్ల‌ను కిరాయికి ఇస్తున్నారు. ఇక ఒక్క‌సారి చెట్టును ఎంపిక చేసుకున్న త‌ర్వాత‌.. ఆ చెట్టు బాగోగులు, సంర‌క్ష‌ణను పూర్తిగా తోట య‌జ‌మానే చూసుకుంటారు. మామిడి పండ్లు చేతికొచ్చిన త‌ర్వాత య‌జ‌మాని నేరుగా కిరాయిదారుడికి పంపించ‌నున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.