📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 7, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

లోకాయుక్త పోలీసుల నుండి కర్ణాటకలో ముడా కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాది స్నేహమయి కృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు జస్టిస్‌ ఎం నాగప్రసన్న తిరస్కరించారు. ఈ క్రమంలో కేసు విచారణకు సీబీఐ దర్యాప్తు పరిష్కారం కాదు. లోకాయుత్త దర్యాప్తు చేయగలదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సిద్దరామయ్య తరఫున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు.

ఇదిలా ఉండగా.. అవినీతి ఆరోపణలతో సిద్ధ రామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్‌ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది.

CM Siddaramaiah Google news High Court. Lokayukta Police muda case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.