కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(Rehan Vadra) దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: TTD: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి…
ఏడేళ్ల ప్రేమకు కుటుంబాల అంగీకారం
రెహాన్ వాద్రా(Rehan Vadra), అవివా బేగ్ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెహాన్ తన భావాలను అవివాకు వెల్లడించగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ బంధానికి ఇరు కుటుంబాల పెద్దలు సంపూర్ణ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అవివా బేగ్ కుటుంబం ఢిల్లీకి చెందినదిగా తెలుస్తోంది. వాద్రా కుటుంబంతో వారి కుటుంబానికి ఇప్పటికే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
రాజకీయాలకు దూరంగా రెహాన్ ప్రత్యేక గుర్తింప
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవాడైనప్పటికీ రెహాన్ వాద్రా ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా, ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అవివా బేగ్ కూడా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారని సమాచారం. ఈ జంట నిశ్చితార్థ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య పూర్తిగా ప్రైవేట్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ఫోటోలు ఇంకా విడుదల కాలేదు. వివాహ తేదీతో పాటు ఇతర వివరాలను కుటుంబ సభ్యులు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: