జంతువుల చిలిపి చేష్టలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అవి చేసే చిన్న చిన్న అల్లరులు నెటిజన్లను నవ్విస్తాయి, ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా ఇలాంటి మరో వీడియో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ వీడియోలో ఒక యువకుడు రీల్ కోసం నేరుగా ఎలుగుబంటి దగ్గరికి వెళ్లాడు. అతని ధైర్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. రీల్‌లో భాగంగా అతను ఎలుగుబంటికి కూల్‌డ్రింక్ (He gave the bear a cold drink) ఇవ్వాలని ప్రయత్నించాడు. దగ్గరగా వెళ్లి బాటిల్ దాని ముందు పెట్టి, తర్వాత దూరంగా వెళ్లిపోయాడు.బాటిల్ దగ్గర పెట్టగానే ఎలుగుబంటి ఆ వస్తువును గమనించింది. తర్వాత బాటిల్‌ను ఎత్తుకుని అందులోని డ్రింక్‌ను తాగింది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్ జిల్లా (Chhattisgarh district) లోని నారా గ్రామ వన్యప్రాణుల కేంద్రంలో చోటుచేసుకుంది.
వైరల్ అయిన వీడియో
ఈ సంఘటనను యువకుడు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయి వేలాది మంది చూసేశారు. అయితే వినోదం కోసం చేసిన ఈ పని తీవ్ర విమర్శలకు దారి తీసింది.వీడియో చూసిన చాలామంది యువకుడి ప్రవర్తనను తప్పుబట్టారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలపై ఆటలు ఆడకూడదని హెచ్చరించారు. ఎలుగుబంట్లు క్రూర మృగాలు, ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంటుందని గుర్తుచేశారు. కేవలం వినోదం కోసం ఇలాంటి రిస్క్‌లు చేయడం తప్పని కామెంట్లు చేశారు.
అధికారుల స్పందన
ఈ వీడియోపై అటవీశాఖ అధికారులు కూడా స్పందించారు. వన్యప్రాణుల వద్దకు వెళ్లి ఇలాంటి పనులు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రీల్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్ మీడియాలో రీల్ లేదా వైరల్ కావడం కోసం ప్రాణాలకు ప్రమాదం కలిగించే పనులు చేయడం ఎంతవరకు సరైంది అన్నది ఆలోచించాల్సిన విషయం. వన్యప్రాణులు ఎప్పటికప్పుడు ఊహించని విధంగా ప్రవర్తిస్తాయి. వాటి దగ్గరికి వెళ్లడం ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఈ సంఘటన అందరికీ ఒక పాఠంగా నిలవాలి.
Read Also :