📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Delhi Blast Investigation : రెడ్ ఫోర్ట్ పేలుడు దర్యాప్తులో కీలక మలుపు కుట్ర వెనుక నిజాలు బయటపడనున్నాయా?

Author Icon By Sai Kiran
Updated: November 17, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Blast Investigation : దిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. పేలుడులో మరణించిన అనుమానాస్పద “సూసైడ్ బాంబర్” డాక్టర్ ఉమర్ ఉన్ నబీ చివరి క్షణాల్ని గుర్తించేందుకు విచారణ అధికారులు ఇప్పుడు ఒక ముఖ్య అంశంపై దృష్టి సారించారు—అతను వినియోగించిన రెండు మొబైల్ ఫోన్లు. ఈ రెండు ఫోన్లు దొరికితే అతనికి ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరు? డబ్బు ఎవరు ఇచ్చారు? ఈ దాడి పెద్ద కుట్రలో భాగమా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉమర్ గత నెలాఖరులో హర్యాణాలోని ఒక మెడికల్ షాపులో రెండు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించాడు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు అతను ఉపయోగించిన ఈ రెండే ఫోన్లు ఇప్పుడు దర్యాప్తులో “మిస్సింగ్ లింక్”గా మారాయి.
అతనికి సంబంధించి ఢిల్లీ, ఫరీదాబాద్, మీవాట్ ప్రాంతాల్లో మొత్తం ఐదు ఫోన్ నంబర్లు గుర్తించారు. కానీ చివరిలో ఉపయోగించిన రెండు ఫోన్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

గత వారం నుంచి NIA, ఢిల్లీ స్పెషల్ సెల్, జమ్మూ–కాశ్మీర్ పోలీస్ సంయుక్తంగా ఉమర్ చివరి 36 గంటల ప్రయాణాన్ని నిమిషానికోసారి రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫరీదాబాద్ నుంచి నూహ్ మీదుగా (Delhi Blast Investigation) ఢిల్లీ వరకు అతని కదలికలను సీసీటీవీ విజువల్స్, టవర్ డంప్స్, ఎన్క్రిప్టెడ్ చాట్ లాగ్స్, సాక్షుల వాంగ్మూలాలతో మ్యాచ్ చేస్తున్నారు.

అక్టోబర్ 30న అతని ప్రధాన నంబర్లు రెండూ డీయాక్టివేట్ అయ్యాయి. అదే రోజు ఉమర్‌కు సన్నిహితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్ట్ కావడంతో, ఉమర్ వెంటనే ట్రేస్ అవగలిగే ఫోన్లను వదిలి, తప్పుడు ఐడెంటిటీలతో కొనుగోలు చేసిన రెండు ప్రీపెయిడ్ నంబర్లకు మారినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

అత్యంత ముఖ్యమైన క్లూ ధౌజ్ మార్కెట్ సీసీటీవీ నుంచి వచ్చింది. అల్ఫలాహ్ యూనివర్సిటీకి దగ్గరలోని ఈ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాపులో ఉమర్ నల్ల బ్యాగ్‌తో కూర్చుని రెండు ఫోన్లు ఉపయోగిస్తున్నాడు. ఒకదాన్ని చార్జింగ్‌కు ఇస్తూ, మరోదాన్ని చేతిలో పట్టుకుని ఉన్నాడు.
దర్యాప్తు బృందం అర్థం చేసుకున్న ప్రకారం— ఒక ఫోన్ సాధారణ కమ్యూనికేషన్ కోసం, మరొకది అతని హ్యాండ్లర్స్‌తో “ఆపరేషనల్ మెసేజింగ్” కోసం.

Latest News: Shubman Gill: శుభ్‌మన్ డిశ్చార్జ్… కానీ మ్యాచ్ డౌట్

అక్కడి నుంచి ఖలీల్‌పూర్, రెవాసన్ టోల్ ప్లాజాలు, ఫరీదాబాద్, చివరకు ఢిల్లీ వరకు మొత్తం 65కి పైగా సీసీటీవీ క్లిప్స్ పరిశీలించారు. కానీ నవంబర్ 9 రాత్రి తర్వాత.

ఇది రెండు అవకాశాలు సూచించిందని అధికారులు అంటున్నారు— అతను ఫోన్లు ఎవరికైనా అప్పగించి ఉండవచ్చు లేకపోతే పేలుడుకు ముందు వాటిని పారబోసివుండవచ్చు

ఫైజ్ ఇలాహీ మస్జిద్‌లో 15 నిమిషాలు గడిపినప్పుడు అతను ఎవరితోనూ మాట్లాడలేదని స్టాఫ్ చెబుతున్నా, దర్యాప్తు బృందం మాత్రం ఆ సమయంలో జరిగిన “డేటా గ్యాప్”ను అనుమానిస్తోంది.
“డేటా లేకపోవడమే ఒక రకమైన సాక్ష్యం” అని ఒక సీనియర్ ఆఫీసర్ పేర్కొన్నారు.

అందుకే నవంబర్ 10న అదే సమయంలో మస్జిద్‌లోకి వచ్చిన వారందరి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఎవరికైనా ఉమర్ ఫోన్లు ఇచ్చిన అవకాశముందో లేదో పరిశీలిస్తున్నారు.

ఆ తర్వాత ఉమర్ తన తెలుపు రంగు Hyundai i20లో నేరుగా రెడ్ ఫోర్ట్‌కి వెళ్లి కెమెరాలు లేని పార్కింగ్ జోన్‌లో వాహనం నిలిపాడు.

టవర్ డంప్స్‌లో నూహ్, తుర్కమాన్ గేట్ ప్రాంతాల్లో రెండు అనుమానాస్పద IMEI నంబర్లు గుర్తించబడ్డాయి. వీటి కదలికలు ఉమర్ ప్రయాణంతో సమాంతరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఉమర్ ఎన్క్రిప్టెడ్ యాప్స్—Signal, Briar, Element—మాత్రమే వాడేవాడని దర్యాప్తు బృందం చెబుతోంది. “డెలివరీ”, “షిప్‌మెంట్”, “టెస్టింగ్” వంటి కోడ్ మాటలను ముజమ్మిల్ ఫోన్‌నుంచి రికవరీ చేశారు. పోలీసుల మాటల్లో— “ఈ ప్రవర్తన ఒకే వ్యక్తి ఉగ్రవాద భావజాలం కాదు… ఎవరో శిక్షణ పొందినవారి విధానం.”

ATM Trail – పేలుడు ముందు చివరి క్లూ (Delhi Blast Investigation)

నవంబర్ 10 తెల్లవారుజామున 1:07 AM సమయంలో నూహ్ జిల్లా ఫిరోజ్‌పూర్ జిర్కా వద్ద ఉన్న HDFC ATMలో నుంచి ఉమర్ రూ. 76,000 నగదు తీసుకున్నాడు.
గ్యార్డు ప్రకారం అతను ఆందోళనతో, త్వరగా వెళ్లిపోవాలనే ఉత్కంఠలో ఉన్నాడు. కారులో బెడ్‌షీట్‌తో కప్పిన వస్తువులు కూడా ఉన్నాయని తెలిపాడు.

పోలీసులు భావిస్తున్నది ఏమిటంటే— ఈ డబ్బు అతని ఆపరేషన్‌కు చివరి సిద్ధత.

Ammunition Mystery – కొత్త అనుమానాలు

రెడ్ ఫోర్ట్ పేలుడు ప్రదేశం దగ్గర నుంచి ఫొరెన్సిక్ బృందాలు రెండు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఒక ఖాళీ 9mm షెల్ స్వాధీనం చేసుకున్నాయి. ఇవి సాధారణంగా భద్రతా సిబ్బంది వాడే రకాలే. (Delhi Blast Investigation)
పేలుడు ప్రదేశంలో గన్ ఫ్రాగ్మెంట్స్ దొరకకపోవడంతో ఇది దర్యాప్తులో కొత్త కోణాన్ని తెచ్చింది.

పోలీసులు రెండు అవకాశాలు పరిశీలిస్తున్నారు—

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Breaking News in Telugu Delhi Blast Investigation Dhauj Market CCTV Faridabad Nuh Movement Google News in Telugu Latest News in Telugu Missing Phones Clue NIA Red Fort Probe Red Fort Blast Red Fort Conspiracy Signal Briar Element Chats Telugu News Umar Digital Footprint Umar Un Nabi Phones

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.