📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

RBI News: డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ

Author Icon By Tejaswini Y
Updated: December 20, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Reserve Bank of India: ఆర్థికంగా దృఢంగా ఉన్న బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఉపశమనం కల్పించింది. డిపాజిట్ల బీమా కోసం బ్యాంకులు చెల్లించే ప్రీమియం విధానంలో మార్పులకు ఆర్‌బీఐ(RBI News) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు అన్ని బ్యాంకులకు ఒకే రకంగా అమలులో ఉన్న ప్రీమియం విధానాన్ని తొలగించి, ఇకపై బ్యాంకు రిస్క్ స్థాయిని బట్టి ప్రీమియాన్ని నిర్ణయించే విధానాన్ని ప్రవేశపెట్టనుంది.

Read also: Adani Group: భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి

RBI News: RBI makes changes in deposit insurance premium

మెరుగైన పనితీరు ఉంటే తక్కువ ప్రీమియం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ డిపాజిట్లపై ప్రతి రూ.100కు 12 పైసల చొప్పున డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC)కు ప్రీమియం చెల్లిస్తున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఈ సమాన ప్రీమియం విధానానికి ముగింపు పలకనుంది. బ్యాంకుల ఆర్థిక స్థితి, పనితీరు, నష్ట భయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించనున్నారు. దీంతో స్థిరమైన ఆర్థిక పరిస్థితి కలిగిన బ్యాంకులకు ప్రీమియం భారం తగ్గే అవకాశం ఉంది.

ఈ కీలక నిర్ణయానికి హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్‌బీఐ(RBI News) డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. భేటీలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bank Premium Policy Banking News Deposit Insurance DICGC RBI Reserve Bank Of India Risk Based Premiu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.