📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

RBI Kisan Credit Card update: కిసాన్ క్రెడిట్ కార్డ్‌లో ఆర్బీఐ కీలక మార్పులు

Author Icon By Pooja
Updated: February 17, 2026 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RBI Kisan Credit Card update : మరింత ఎక్కువ మంది రైతులకు ద్రవ్యపరపతిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు. రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో పెద్ద మార్పు లు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనికి సంబంధించి ద్రవ్య పరపతి విధాన కమిటీ, ఎంపీసీ, సమావేశం తర్వాత అభివృద్ధి సంబంధిత నియంత్రణ విధానాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మార్పుల ఉద్దేశ్యం ఎక్కువ మంది రైతులకు ఈ పథకం చేరేలా చేయడం, ప్రక్రియలను సులభం చేయడమని తెలిపింది. వ్యవసాయ రంగం అవసరాలు కాలానుగుణంగా మారుతు న్నాయి కాబట్టి వాటికి సరిపడేలా రుణ వ్యవస్థను మార్చడం ప్రధానమని పేర్కొంది. ఇదే సమయంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంపై పూర్తిస్థాయి సమీక్ష పూర్తయిందని తెలిపింది.

Read Also:Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు

RBI Kisan Credit Card update: RBI’s key changes in Kisan Credit Card

ఈ సమీక్షలో కవరేజ్ పెంపు, పని విధానాలు కిసాన్ క్రెడిట్కార్డు సులభతరం రిజర్వ్ బ్యాంక్ కీలక మార్పులు త్వరలో మార్గదర్శకాలు విడుదల సరళీకరణ, వ్యవసాయ రంగం అలాగే అనుబంధ రంగాల్లో వస్తున్న కొత్త అవసరాలపై దృష్టి పెట్టింది. వ్యవసాయ రంగం అలాగే అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ మార్గదర్శకాలు ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకే కొత్త ఫ్రేమ్ వర్క్ రూపొందించి బ్యాంకులకు సవరించిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర బ్యాంక్ భావిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్గదర్శకాలలో పంట కాలం ఒకే విధంగా నిర్ణయించే విధానం ఉంది. అన్ని ప్రాంతాల్లో ఒకే రీతిలోచ నా౦టూతాన్ని నిర్వచించడం వల్ల చెల్లింపు కాలపరిమితుల్లో స్పష్టత వస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ గడువును ఆరు సంవత్సరాలకు పెంచాలని కూడా ఆర్బీఐ సూచించింది.

దీని వల్ల రైతులకు బ్యాంకులతో దీర్ఘకాలం స్థిరమైన రుణ సంబంధం ఏర్పడుతుంది. ప్రతి పంట కాలానికి ఉన్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా డ్రాయింగ్ లిమిట్ నిర్ణయించే విధానాన్ని తీసుకు రానున్నారు. ఇలా చేయడం వల్ల సాగు ఖర్చులకు దగ్గరగా రుణ పరిమితి లభిస్తుంది. ఆధునిక పరికరాలు, ప్రిసిషన్ ఫార్మింగ్ సాధనాలు, ఇతర అగ్రి టెక్ పరిష్కారాలపై అయ్యే ఖర్చులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద అర్హమైన వినియోగంగా చేర్చనున్నారు.. ఈ మార్పులన్నీ కలిగిన ముసాయిదా మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని ఆర్ బీఐ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.