📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం

Author Icon By sumalatha chinthakayala
Updated: April 17, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవం దక్కింది. యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ అవార్డుకు యంగ్ గ్లోబల్ లీడర్స్ ఎంపిక చేసింది. 40 ఏళ్ల లోపు వయస్సు ఉండి వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసి, ప్రపంచ స్థితిగుతల అభివృద్ధికి కృషి చేసే యువకులకు ఏటా యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుల ప్రదానం చేయనుంది. రామ్మోహన్ నాయుడుతో పాటు భారత్ నుంచి యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు ఏడుగురు. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారతీయులు వీరే..

రితేష్ అగర్వాల్ : ఈయన OYO హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు : ఈయన భారత పౌర విమానయాన శాఖ మంత్రి.
మానసి సుబ్రమణ్యం : ఈమె పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాలో చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు.
నటరాజన్ శంకర్ : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో మేనేజింగ్ డైరెక్టర్, భాగస్వామిగా పనిచేస్తున్నారు.
అనురాగ్ మాలూ : ఈయన పర్వతారోహకుడు. ఓరోఫైల్ వెంచర్స్ (క్లైంబింగ్ 4SDGs)లో కీనోట్ స్పీకర్.
నిపున్ మల్హోత్రా : ఈయన నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.
అలోక్ మెడికేపుర అనిల్ : ఈయన నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్.
హిమాంశు గుప్తా : క్లైమేట్ ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు.
తెరాశ్ని పిళ్లై : ఈమె స్విస్ ఆర్‌ఈ కార్పొరేట్ సొల్యూషన్స్ ఆఫ్రికా విభాగం సీఈఓగా ఉన్నారు.

ఏటా 100 మందికిపైగా ప్రభావవంతమైన యువత

కాగా, సూమారు దాదాపు 1000 కార్పొరేట్ కంపెనీలు కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరంను నడుపుతున్నాయి. ఆ కంపెనీల నుంచే వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహణకు నిధులు సమకూరుతుంటాయి. ఏటా 100 మందికిపైగా ప్రభావవంతమైన యువతను యంగ్ గ్లోబల్ లీడర్ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. వారికి మూడేళ్ల పాటు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఏర్పాటు చేస్తుంది. వరల్డ్ ఎకానమిక్ ఫోరంకు నిధులను అందించే కంపెనీల విజన్‌కు అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ అవుతాయి. ఆర్థిక, టెక్, ప్రభుత్వ వ్యవహారాలు, క్రియేటివ్ పరిశ్రమలు, ప్రజా సేవ వంటి విభాగాల యువతను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

Read Also: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభం

Breaking News in Telugu Google News in Telugu india Latest News in Telugu Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Union Minister Rammohan Naidu Young Global Leader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.