📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Ranya Rao: కన్నడ నటికి ఈడీ ఝలక్ – రూ.34 కోట్ల ఆస్తులు జప్తు

Author Icon By Shobha Rani
Updated: July 5, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ సినీ నటి రాన్యా రావు(Ranya Rao)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆమెకు చెందిన రూ.34.12 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరు జిల్లాల్లో ఉన్న ఈ ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) (PMLA))కింద అటాచ్ చేసినట్టు ఈడీ శుక్రవారం వెల్లడించింది. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
కేసు మొదలైన విధానం
ఈ ఏడాది మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాన్యా రావు 14.213 కిలోల బంగారంతో పట్టుబడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె వద్ద ఉన్న బంగారం విలువ రూ.12.56 కోట్లుగా గుర్తించారు. అంతకుముందే, ముంబై విమానాశ్రయంలో ఇద్దరు విదేశీయుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) (DRI) అధికారులు 21.28 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఆధారంగా సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌తో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

కన్నడ నటికి ఈడీ ఝలక్ – రూ.34 కోట్ల ఆస్తులు జప్తు

స్మగ్లింగ్ మాఫియా విస్తరణ
దుబాయ్, ఉగాండా వంటి దేశాల నుంచి స్మగ్లింగ్ సిండికేట్ బంగారం తరలిస్తున్నట్టు ఈడీ విచారణలో బయటపడింది. రాన్యా రావు (Ranya Rao)తన సహచరుడు తరుణ్ కొండూరు రాజు, మరికొందరితో కలిసి ఈ దందాను నడిపినట్టు తేలింది. హవాలా మార్గంలో డబ్బు చెల్లించి, నకిలీ పత్రాలతో బంగారాన్ని భారత్‌కు తరలించేవారని అధికారులు గుర్తించారు. ఇక్కడ ఆ బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును మళ్లీ హవాలా ద్వారా స్మగ్లింగ్ కోసం ఉపయోగించేవారని దర్యాప్తులో తేలింది.
ఈడీ నిర్దేశించిన అక్రమ సంపద
ఈ కేసులో మొత్తం రూ.55.62 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఈడీ లెక్క తేల్చింది. అయితే, విచారణలో రాన్యా రావు (Ranya Rao) తన ప్రమేయాన్ని నిరాకరించినప్పటికీ, స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు, పత్రాలు ఆమె వాదనను తోసిపుచ్చాయని అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్‌కు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై కూడా నిఘా పెట్టినట్టు, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Hyderabad real estate fraud : రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టిన నెల్లూరు

Bangalore actress gold smuggling Breaking News in Telugu Dubai smuggling network India ED investigation gold ED seizes Kannada actress assets Enforcement Directorate News gold smuggling India 2025 Google news Hawala transactions India Latest News in Telugu Paper Telugu News Ranya Rao 34 crore assets seized Ranya Rao ED case Ranya Rao gold smuggling Ranya Rao PMLA case Tarun Konduru Ranya Rao Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.