Ranjana Nachiar Joins DMK: విజయ్ పార్టీకి బిగ్ షాక్: డీఎంకేలో చేరిన రంజన నాచియార్

Read Time:  1 min
Ranjana Nachiar Joins DMK: విజయ్ పార్టీకి బిగ్ షాక్: డీఎంకేలో చేరిన రంజన నాచియార్
FONT SIZE
GET APP

Ranjana Nachiar Joins DMK: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రంజన నాచియార్ ఆ పార్టీకి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో డీఎంకే (DMK) తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి నుండి వచ్చి టీవీకేలో చేరిన రంజన నాచియార్, అక్కడ కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. డీఎంకేలో చేరిన అనంతరం ఆమె మీడియా ముందు విజయ్ పార్టీ తీరును ఎండగట్టారు.

Read Also: Ashok Kumar Karat Astrology Rape Case: జ్యోతిష్యుడు అశోక్ కారత్ అరెస్ట్

Ranjana Nachiar Joins DMK: బీజేపీ, ఏఐఏడీఎంకేలపై విమర్శలు

టీవీకే నాయకత్వంపై ఆరోపణలు గుప్పించారు. మహిళలను గౌరవించడం తెలియదని విమర్శించారు. నేతలు అందుబాటులో ఉండట్లేదని ధ్వజమెత్తారు.పార్టీ నాయకులకు కార్యకర్తల ఇబ్బందులు పట్టట్లేదని, మహిళలను పదే పదే అగౌరవపరుస్తున్నారని రంజన ధ్వజమెత్తారు. ముఖ్యంగా విజయ్ తన పూర్వీకురాలు రాణి వేలు నాచియార్ ప్రతిబింబంగా తనను తాను చూపిస్తూ కించపర్చుతున్నారని ఆమె స్పష్టం చేశారు. అటు బీజేపీ, దాని మిత్రపక్షం ఏఐఏడీఎంకేపైనా ఆమె విమర్శలు చేశారు. తమిళనాడుపై హిందీ బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని, దీన్ని తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు.

ranjana-nachiar-quits-tvk-joins-dmk-vijay-party-shocker
ranjana-nachiar-quits-tvk-joins-dmk-vijay-party-shocker

త్రిభాషా సూత్రం తమిళనాడు భాషా వారసత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని, కేంద్రీకృత విధానాల వల్ల తమిళనాడుకు నష్టమని రంజన పేర్కొన్నారు. అతి జాతీయవాద పోకడలు తమిళనాడులో చెల్లబోవని అన్నారు. ప్రాంతీయ సున్నితత్వాలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని, మహిళా నాయకులకు సరైన గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో రంజనా నాచియార్ సుదీర్ఘకాలం పాటు బీజేపీలో కొనసాగారు. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేశారు. 2025 ఫిబ్రవరిలో ఆమె బీజేపీని వీడారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.