📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

RAN: క్యాన్సర్ రోగులకు రూ. 15 లక్షల వరకు ఉచిత చికిత్స

Author Icon By Saritha
Updated: February 4, 2026 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్యాన్సర్ (Cancer) వచ్చిందంటే చాలు.. ప్రాణం పోతుందనే భయం ఓవైపు అయితే చికిత్స కోసం డబ్బులు ఎలా అనే భయం మరోవైపు మొదలువుతుంది. ఈ ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రీయ ఆరోగ్య నిధి (RAN) పథకం ద్వారా అర్హులైన క్యాన్సర్ రోగులకు రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Also: Chattisghar: నంబర్‌ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు

ఈ పథకానికి అర్హులు ఎవరంటే?

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంబ్రెల్లా స్కీమ్ ఆఫ్ రాష్ట్రీయ ఆరోగ్య నిధిలో భాగంగా హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ (HMCPF) ద్వారా ఈ ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. (RAN) క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా సర్కారు తీసుకొచ్చిన ఈ పథకం కింద నిధులను నేరుగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా రీజినల్ క్యాన్సర్ సెంటర్లకు కేంద్రం విడుదల చేస్తుందన్నారు. దారిద్ర్య రేఖ కింద ఉన్న క్యాన్సర్ రోగులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అర్హత కోసం రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనికి అర్హులు కారు.

దరఖాస్తు రోగి చికిత్స పొందుతున్న RCC ఆసుపత్రిలో లభిస్తుంది. ఫారమ్‌పై డాక్టర్ సంతకం, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ఆధార్, రేషన్ కార్డు కాపీలు జత చేయాలి. అన్ని పత్రాలు నోడల్ ఆఫీసర్‌కు సమర్పించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. మరో విషయం రోగి ఆయుష్మాన్ భారత్ లేదా రాష్ట్ర ఆరోగ్యశ్రీ పథకాల కింద కవర్ కాకపోతేనే ఈ ఫండ్ సహాయం సులభం. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Cancer Treatment Support Central Government Health Scheme Financial Assistance for Cancer Patients Latest News in Telugu Rashtriya Arogya Nidhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.