Ramzan leave : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు చెందిన సిబ్బందికి మాత్రమే ఈ సడలింపు వర్తించదు. ప్రార్థనల కోసం సమయం దొరకేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Also: Tamil Nadu: హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు
ఇదే సమయంలో ఉర్దూ మీడియం పాఠశాలల పని వేళల్లో కూడా మార్పులు చేశారు. అవి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించబడతాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. రంజాన్ ప్రార్థనలు సులభంగా నిర్వహించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: