📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Telugu News: Rammohan Naidu: ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు మంత్రి రామ్మోహన్ నాయుడు

Author Icon By Sushmitha
Updated: December 9, 2025 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో (IndiGo) కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ, ప్రణాళికా లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర ఇబ్బందులకు ఆ సంస్థను బాధ్యుల్ని చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) స్పష్టం చేశారు, మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ, నిబంధనలు పాటించని ఏ ఎయిర్‌లైన్స్ (Airlines) సంస్థను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రయాణికులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చే పటిష్టమైన విమానయాన రంగాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

Read Also: PM Modi: ఇండిగో రద్దులపై ప్రధాని మోదీ స్పందన

Strict action against IndiGo is inevitable: Minister Rammohan Naidu

డీజీసీఏ చర్యలు, విచారణ, మరియు రీఫండ్‌ల పర్యవేక్షణ

ఈ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు, విచారణ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు, తమ షెడ్యూళ్లను సమర్థంగా నిర్వహించడంలో విఫలమైనందున, ఇండిగో తన రోజువారీ సర్వీసుల్లో 5 శాతం కోత విధించాలని డీజీసీఏ ఆదేశించింది.

ఇప్పటికే ప్రయాణికులకు 750 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ చేసినట్లు ఇండిగో సంస్థ తమకు తెలియజేసిందని రామ్మోహన్ నాయుడు సభకు వివరించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దయిన విమానాల రీఫండ్లు మరియు బ్యాగేజీ సమస్యలు మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్నాయన్నారు.

ప్రభుత్వ జోక్యం, ఛార్జీల పరిమితి మరియు నిబంధనలు

ప్రభుత్వం ఈ సమస్యలో జోక్యం చేసుకుని ప్రయాణికులను ఆదుకోవడానికి విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధించిందని మంత్రి తెలిపారు, అంతేకాకుండా, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు రీబుకింగ్‌లు చేశారని వివరించారు, పైలట్లు, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి ప్రకటన అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

750 crore refund air ticket price limits Google News in Telugu IndiGo airline operations Latest News in Telugu Opposition Walkout ram mohan naidu scheduling failure Telugu News Today Union Civil Aviation Minister

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.