📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Ramdas Soren: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ ఇకలేరు!

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయంగా సానుభూతి కలిగించిన, ప్రజలకు ఆదర్శంగా నిలిచిన రాందాస్ సోరెన్,తన నివాసంలోని బాత్రూంలో జారి పడిన సంగతి తెలిసిందే. సోరెన్ మెదడుకు తీవ్ర గాయం కావడంతో పాటు రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అదే రోజు అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి (Apollo Hospital) కి హెలికాప్టర్ ద్వారా తరలించారు.అనారోగ్యంతో శుక్రవారం (ఆగస్ట్ 15) మరణించారు. న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నా తండ్రి ఇప్పుడు మన మధ్య లేరని చాలా బాధతో మీ అందరికీ తెలియజేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ఆగస్ట్ 2న రాందాస్ తన నివాసంలో బాత్రూంలో జారి పడ్డారు. సోరెన్ మెదడుకు తీవ్ర గాయం కావడంతో పాటు రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు.

రాజకీయాల్లో విషాదచాయలు

దీంతో అదే రోజు అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు.అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డారు. రాందాస్ సోరెన్ (Ramdas Soren) మృతికి నివాళిగా జార్ఖండ్ ప్రభుత్వం ఒకరోజు సంతాపం దినంగా ప్రకటించింది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు మరణించడంతో జార్ఖండ్ రాజకీయాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. సోరెన్‌ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా సోరెన్ అనారోగ్యం కారణంగా వర్షాకాల సమావేశంలో విద్య, అక్షరాస్యత శాఖ బాధ్యతలను సుదివ్య కుమార్ సోనుకు అప్పగించిన సంగతి తెలిసిందే. సోరెన్‌కు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.1963, జనవరి 1న తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఘోరబంద గ్రామంలో జన్మించిన సోరెన్ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చారు.

రాజకీయ ప్రస్థానం

ఘోరబంద పంచాయతీ గ్రామ ప్రధాన్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సోరెన్‌.. అంచెలంచెలుగా ఎదిగి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో అత్యంత ప్రభావవంతమైన మంత్రులలో ఒకరిగా ఎదిగారు.1990లో ఆయన JMM పార్టీకి జంషెడ్‌పూర్ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఘట్‌శిల అసెంబ్లీ స్థానం నుంచి 2005 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యత్నించారు. కానీ ఆ సీటు జెఎంఎం కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు దక్కింది. అయితే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం సోరెన్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్శిల నుంచి పోటీ చేసి మొదటిసారి జార్ఖండ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ తుడు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి ఆ సీటును కైవసం చేసుకున్నారు. 2024లో మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కుమారుడు, బీజేపీకి చెందిన బాబులాల్ సోరెన్‌ను ఓడించి.. సోరెన్ మూడోసారి కూడా ఇదే స్థానాన్ని గెలుచుకున్నారు. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని కేబినెట్లో విద్యా, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/non-veg-food-do-you-know-which-state-in-our-country-consumes-the-most-non-veg-food/national/531487/

Breaking News Jharkhand education minister passes away Jharkhand minister Randas Soren latest news Randas Soren bathroom accident Randas Soren death Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.