हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Ramdas Soren: మంత్రి రాందాస్ సోరెన్‌ తలకు తీవ్ర గాయాలు..హుటా హుటిన ఢిల్లీకి తరలింపు

Sharanya
Ramdas Soren: మంత్రి రాందాస్ సోరెన్‌ తలకు తీవ్ర గాయాలు..హుటా హుటిన ఢిల్లీకి తరలింపు

ఝార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ (Ramdas Soren) శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జంషెడ్‌పూర్‌ (Jamshedpur)లోని తన నివాసంలో బాత్రూంలో జారి పడిపోయారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలవడంతో పాటు, చేతికి కూడా గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, సహచరులు ఆయనను టాటా మోటార్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

మెదడులో రక్తం గడ్డకట్టినట్టు నివేదిక

ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన స్కాన్‌ పరీక్షల్లో సోరెన్ కు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తక్షణమే మెరుగైన వైద్యసేవల కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీ (Delhi in air ambulance)కి తరలించాలని నిర్ణయించారు. సోరెన్‌ను ఢిల్లీలోని మేదాంతా లేదా అపోలో ఆసుపత్రికి అత్యవసరంగా తరలించనున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఆయన్ను ఐసీయూలో ఉంచి ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించనున్నారు.

రాజకీయ నేపథ్యం

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత అయిన రాందాస్ సోరెన్ (Ramdas Soren), ఘట్‌షిలా నియోజకవర్గానికి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2024లో సీఎం హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో విద్యా, సాక్షరత, రిజిస్ట్రేషన్ శాఖల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డిసెంబర్‌లో రెవెన్యూ, రవాణా శాఖల బాధ్యతలు కూడా అప్పగించబడ్డాయి.

మంత్రికి ఈ ప్రమాదం సంభవించిన వెంటనే జేఎంఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సహా పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీ రాందాస్ సోరెన్ ఎవరు?

శ్రీ రాందాస్ సోరెన్ భారత రాజకీయ నాయకుడు. ఆయన ఝార్ఖండ్ ముఖ్తి మోర్చా (JMM) పార్టీకి చెందినవారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో పాఠశాల విద్యా మరియు అక్షరాస్యత శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/chennai-couple-on-honeymoon-dies-tourism-company-fined-in-crores/national/524758/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870