భారత రక్షణరంగంలో పరిశోధనను, అభివృద్ధిని బలోపేతం చేయడానికి వినూత్న వ్యవస్థ (Innovative system)ను వృద్ధిచేస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చెప్పారు. ‘డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్’ 278వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత బాగా పెరిగిందని, ఇది మనకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు.
కొత్తగా వస్తున్న సాంకేతికతలు ఏళ్లుగా జరిగిన పరిశోధన, అభివృద్ధి ఆధారంగా రూపొందించినవని రాజ్‌నాథ్ (Rajnath Singh) చెప్పారు. ఆ సాంకేతికతలను మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయని, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. అందుకే రక్షణ బడ్జెట్ కూడా ఏటా పెరుగుతుందని అన్నారు. బడ్జెట్ పెరుగుదలతో దాన్ని తెలివిగా ఉపయోగించాల్సిన బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు. రక్షణరంగంలో సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి (Rajnath Singh) చెప్పారు. మన సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు.
భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా జరుపుకుంటుంది?
రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ను ‘సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించింది. ఈ ప్రకటనలు సాయుధ దళాలను బహుళ-డొమైన్ సమగ్ర కార్యకలాపాలను నిర్వహించగల సాంకేతికంగా అభివృద్ధి చెందిన పోరాట-సన్నద్ధ శక్తిగా ఆధునీకరించడం మరియు కొనసాగుతున్న మరియు భవిష్యత్తు సంస్కరణలకు ఊతం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
2025 లో DRDO సంస్కరణలు ఏమిటి?
జూన్ 2025లో, DRDO భారత సాయుధ దళాలకు అత్యవసర సేకరణ కోసం రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన 28 ఆయుధ వ్యవస్థల కోసం ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది, ఇందులో వివిధ రకాల DRDO రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన క్షిపణులు మరియు మందుగుండు సామగ్రి ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: